సోంపు మౌత్ ఫ్రెష‌న‌ర్‌ మాత్రమే కాదు.. దివ్య ఔషదం కూడా.. 

TV9 Telugu

13 January 2025

స‌హ‌జ‌సిద్ధ మౌత్ ఫ్రెష‌న‌ర్‌గానూ చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది రుచి, ఫ్లేవ‌ర్‌ను జోడించ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తుంది.

ఇంట్లోనే సోంపు వాట‌ర్‌ను త‌యారు చేసుకుని తాగ‌డం ద్వారా దీని ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చని అన్నారు పోషకాహార నిపుణులు.

బ‌రువు త‌గ్గ‌డం నుంచి జీర్ణ‌క్రియ, చ‌ర్మ ఆరోగ్యం వర‌కూ ఇది మ‌న శ‌రీర ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది.

భోజ‌నానంత‌రం సోంపును న‌మ‌ల‌డం మ‌న ఇండ్ల‌లో స‌ర్వ‌సాధార‌ణంగా చూస్తుంటాం. ఇది జీర్ణ‌క్రియ సాఫీగా చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప‌దార్ధాలు శ‌రీరానికి మేలు చేస్తాయి. సోంపు వాట‌ర్‌తో బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ సులువ‌వుతంది.

సోంపులో ఉండే ఫైబ‌ర్ ద్వారా క‌డుపు నిండిన భావ‌న క‌లిగి ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. కొవ్వు క‌రుగుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి.

సోంపు జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంతో ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

సోంపుతో చ‌ర్మ సంర‌క్ష‌ణ‌, డీటాక్సిఫికేష‌న్‌, స్త్రీలలో రుతుక్ర‌మ స‌మ‌స్య‌ల నియంత్ర‌ణ‌ సక్రమంగా ఉంటుంది.