Abhishek Sharma: ఉన్న ఒక్క హాలీడేను నాశనం చేసారు కదరా! ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడ్డ SRH ఓపెనర్
భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఇండిగో విమానయానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ సేవలను చెత్తగా విమర్శించారు. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన సమస్య వల్ల తన ఫ్లైట్ మిస్ అయినట్లు తెలిపారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో ఇండిగో 103వ స్థానంలో ఉండగా, కంపెనీ ఈ నివేదికలను తిరస్కరించింది. ఈ సంఘటన విమానయాన సంస్థల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్సమెన్ అభిషేక్ శర్మ ఇండిగో విమానయాన సంస్థ సేవలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ప్రవర్తన తన హాలీడేను పూర్తిగా నాశనం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిషేక్, కౌంటర్ మేనేజర్ సుస్మితా మిట్టల్ ప్రవర్తనను కఠినంగా విమర్శించారు.
“నేను సరైన కౌంటర్‌కి సమయానికి చేరుకున్నప్పటికీ, వారు నన్ను మరో కౌంటర్‌కు అనవసరంగా దారి మళ్లించారు. ఈ దారి తప్పుదోవ వల్ల నా ఫ్లైట్ మిస్ అయింది, నా సెలవు మొత్తం పాడైపోయింది,” అని అభిషేక్ వెల్లడించారు. ఈ సంఘటనతో ఇండిగో సిబ్బంది నిర్వహణ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ప్రపంచ విమానయాన సంస్థల ర్యాంకింగ్‌లో ఇండిగో 103వ స్థానంలో నిలిచింది, ఇది భారతదేశ విమానయాన రంగానికి మైనస్‌గా నిలిచింది. ఎయిర్‌హెల్ప్ రిపోర్ట్ 2024 ప్రకారం, ఇండిగో సేవలు, కస్టమర్ ఫిర్యాదులు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇండిగో సంస్థ ఈ నివేదికను తిరస్కరించింది.
ఇండిగో తమ సేవలను సమర్థించుకునే ప్రయత్నంలో, తక్కువ ఫిర్యాదు నిష్పత్తి, సమయపాలనకు అధిక స్కోర్ అని చెప్పింది. కానీ, అభిషేక్ శర్మ అనుభవం భారతదేశ విమానయాన సంస్థల సేవలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..