- Telugu News Photo Gallery Home made tan remove tips for tanned feet, check here is details in Telugu
Feet Care: మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేయాలి. అందం అంటే కేవలం ముఖానికే కాదు.. శరీరంలోని అన్ని భాగాలను చక్కగా చూసుకోవాలి. చాలా మందికి పాదాలు నలుపుగా ఉంటాయి. పాదాలపై సరైన కేర్ తీసుకోపోవడం వల్ల ట్యాన్ పెరిగి.. నలుపుగా మారతాయి. పాదాలపై ఉండే నలుపును పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండేవాటితోనే..
Updated on: May 03, 2024 | 4:38 PM

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేయాలి. అందం అంటే కేవలం ముఖానికే కాదు.. శరీరంలోని అన్ని భాగాలను చక్కగా చూసుకోవాలి. చాలా మందికి పాదాలు నలుపుగా ఉంటాయి.

పాదాలపై సరైన కేర్ తీసుకోపోవడం వల్ల ట్యాన్ పెరిగి.. నలుపుగా మారతాయి. పాదాలపై ఉండే నలుపును పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండేవాటితోనే మంచి రిమూవింగ్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

చర్మ సమస్యల్ని తగ్గించడంలో పసుపు చక్కగా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. పాల మీగడలో కొద్దిగా పసుపు కలిపి.. పాదాలపై మర్దనా చేసి కడగండి. ఇలా తరచూ చేస్తే మీ పాదాలపై నలుపు తగ్గిపోతుంది.

చనగ పిండితో కూడా నలుపును తగ్గించుకోవచ్చు. చనగ పిండి చర్మానికి స్క్రబ్బర్‌లా ఉపయోగపడుతుంది. ఇది మంచి ఎక్స్ ఫోలియెంట్‌లా పని చేసి కాళ్ల రంగును మార్చుతుంది. శనగ పిండిలో పాలు కలిపి తరచూ కాళ్లపై మసాజ్ చేస్తే రంగు మారుతుంది.

టమాటా, పంచదారతో కూడా మీ పాదాల రంగును మార్చుకోవచ్చు. పండిన టమాటాను సగానికి కట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పంచదారను కట్ చేసిన టమాటా మీద వేసి.. కాళ్లపై ఓ ఐదు నిమిషాల పాటు రుద్దండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది.




