Pragya Jaiswal: అమ్మాడి దశ తిరిగింది.. ప్రగ్యాకు కలిసొచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్.. బ్యూటీ ఆస్తులు ఎంతంటే..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు ప్రగ్యా జైస్వాల్. తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీలో నటించింది. ఈ మూవీ జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Rajitha Chanti

|

Updated on: Jan 13, 2025 | 1:25 PM

బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ప్రగ్యా జైస్వాల్. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రద్ధా శ్రీనాథ్ సైతం కీలకపాత్ర పోషించింది.

1 / 5
1991 జనవరి 12న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది ప్రగ్యా. పూణేలో లా చదివిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది. 2014లో విరుట్టు అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

2 / 5
2015 బిగ్ బాస్ విజేత అభిజిత్ హీరోగా నటించిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ప్రగ్యాకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
కంచె తర్వాత ప్రగ్యాకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

4 / 5
ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే.. ప్రగ్యా జైస్వాల్ యూట్యూబ్ ద్వారా ఏడాదికి 9 కోట్లు సంపాదిస్తుందట. నివేదికల ప్రకారం ప్రగ్యా జైస్వాల్ ఆస్తులు ఇప్పటివరకు రూ.50 కోట్లు ఉన్నట్లు సమాచారం.

5 / 5
Follow us