సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏడాది పొడవునా రవాణాకు నో వర్రీ

జమ్ముకశ్మీర్‌లో మరో గేమ్‌ఛేంజర్‌ ప్రారంభమైంది. భారత్‌కు ఇటు రవాణా పరంగా..అటు రక్షణపరంగా కీలకమైన సోన్‌మార్గ్‌ టన్నెల్‌ను..ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. 12 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్‌ను..2 వేల 700 కోట్ల వ్యయంతో నిర్మించింది కేంద్రం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి

సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏడాది పొడవునా రవాణాకు నో వర్రీ
Pm Modi Z Morh Tunnel
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 13, 2025 | 12:56 PM

కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు..రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా..ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తోంది. శ్రీనగర్‌ను..రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగా సోన్‌మార్గ్‌ ప్రాంతంలో నిర్మించిన జడ్‌ మోర్హ్ టన్నెల్‌‌ను.. సంక్రాంతి పండుగ పూట ప్రధాని మోదీ ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు.

6.5 కిలోమీటర్ల పొడవైన జెడ్ మోర్హ్ టన్నెల్‌ను..ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2,700 కోట్లు వెచ్చించింది. ఈ టన్నెల్ శ్రీనగర్– సోనామార్గ్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. హిందూ తీర్థయాత్రల్లో అత్యంత క్లిష్టమైన ‘అమర్‌నాథ్ యాత్ర’లో సోనామార్గ్ ఒక కీలక మజిలీ. బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్‌నాథ్ యాత్రలో హెలీకాప్టర్ ద్వారా వెళ్లేవారు సోనామార్గ్‌లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగానూ సోనామార్గ్ కీలక ప్రాంతం.

ఆధ్యాత్మకం, పర్యాటకం కంటే కూడా భారత ప్రభుత్వానికి ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా కీలకం. జమ్ము-కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని ద్రాస్, కార్గిల్ సెక్టార్లలో భద్రతా విధులు నిర్వహించే సైనికులకు సైతం ఈ టన్నెల్ కీలకం. మొత్తంగా..కశ్మీర్‌ లోయలో నిర్మించిన జెడ్‌ మోర్హ్‌ టన్నెల్‌.. శీతాకాలపు హిమపాతం ఇబ్బందులను తొలగించడడంతోపాటు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారుతుంది.

ఇది చదవండి: సంక్రాంతి జాతర.. ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి