Viral Video: రూ.10 కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడి.. నెట్టింట వీడియో వైరల్

బస్సులో పది రూపాయల కోసం ఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి బస్ కండక్టర్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి మొదట బస్ కండక్టర్ పై చేయి చేసుకోగా.. బస్ కండక్టర్ వృద్దుడు అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు. ఈ వీడియో రాజస్థాన్ లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.

Viral Video: రూ.10 కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడి.. నెట్టింట వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2025 | 12:20 PM

బస్సులో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జైపూర్‌లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారిపై బస్ కండక్టర్ దాడి చేసిన సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. 75 ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి బస్సులో రూ. 10 అదనపు ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించారు. దీంతో బస్సు కండక్టర్‌ ఆ వృద్ధడిపై దాడి చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. బాధితుడు తాను దిగాల్సిన బస్‌స్టాప్‌ నుంచి ముందుకొచ్చారు. దీంతో బస్ కండక్టర్ నెక్స్ట్ స్టాప్ లో దిగాలని.. అందుకు రూ. 10 అదనంగా టికెట్ ఛార్జీ చెల్లించాలని .. ఆ వృద్ధుడుని కోరాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సంఘటన వీడియో వైరల్‌గా మారింది.

కనోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఉదయ్ సింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ RL మీనా.. ఆగ్రా రోడ్‌లోని కనోటా బస్టాండ్‌లో దిగాల్సి ఉంది. అయితే బస్ స్టాప్ వచ్చిందని కండక్టర్ రిటైర్డ్ అఫీసర్ కు చెప్పడం మరచిపోయాడు. దీంతో బస్సు నెక్స్ట్ స్టాఫ్ నైలా వద్దకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

కండక్టర్ రిటైర్డ్ ఆఫీసర్ మీనాను అదనపు ఛార్జీలు అడిగినప్పుడు వాగ్వాదం జరిగింది. అప్పుడు ఆ వృద్ధుడు డబ్బులు చెల్లించడానికి నిరాకరించాడు. అప్పుడు కండక్టర్ .. వృద్దుడని కూడా చూడకుండా.. మీనాను నెట్టాడు. దీంతో మీనాకు కోపం వచ్చి.. కండక్టర్‌ చెంపపై ఒక దెబ్బ వేశాడు. అంతే కండక్టర్ కు తీవ్ర కోపం వచ్చి.. ఆ వృద్ధుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడని Mr సింగ్ చెప్పారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడు బస్సు దిగే వరకు అనేక మంది ప్రయాణికులు చూస్తుండగా.. కండక్టర్ కొడుతూనే ఉన్నాడు. కండక్టర్‌ను ఘనశ్యామ్ శర్మగా గుర్తించామని సింగ్ చెప్పారు. శనివారం కనోటా పోలీస్ స్టేషన్‌లో మిస్టర్ మీనా ఫిర్యాదు ఆధారంగా కండక్టర్ పై ఫిర్యాదు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుగుతోంది. కాగా ప్రయాణీకుడి విషయంలో అనుచితంగా ప్రవర్తించిన నిందితుడైన కండక్టర్‌ను జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..