కిటికీ నుంచి వింత శబ్ధాలు.. వెళ్లి చూసిన యజమానికి షాక్
అడవులు, వనాల్లో ఉండాల్సిన విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి... ఆహారాన్ని వెతుక్కుంటూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. తాజాగా విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో.. ఓ ఇంట్లోకి పాము చొరబడింది. అది కూడా అత్యంత విషపూరితమైన పాము కావడంతో అంతా భయపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు.
విశాఖ కూర్మన్నపాలెం దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరీ నగర్ లో ఓ ఇంటిలోని వారంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఇంతలో కిటికీలోంచి వింత శబ్ధాలు వినిపించాయి. మొదట అందరూ లైట్ తీసుకున్నారు. అయితే కంటిన్యూగా శబ్దాలు రావడంతో… ఏమై ఉంటుందా అని వెళ్లి చూసిన యజమాని దెబ్బకు షాకయ్యాడు. ఓ పెద్ద రక్తపింజర పాము కిటికీలోంచి ఇంట్లోకి చొరబడుతోంది. ఆ సీన్ చూసిన అతని గుండెలదిరాయి. వెంటనే ఇంట్లోనివారిని అలర్ట్ చేశాడు. వారంతా వచ్చి ఆ పామును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పామును చూసేందుకు చుట్టపక్కలవారంతా అక్కడ గుమిగూడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు..
ముళ్ల పందులు, చిరుత ఎలా కొట్లాడుకున్నాయో చూడండి
డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

