రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్

రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్

Phani CH

|

Updated on: Jan 12, 2025 | 12:50 PM

18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది దీపిక. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అటు సినిమాలు.. ఇటు యాడ్స్, బిజినెస్ రంగాల్లో భారీగా సంపాదిస్తుంది. కట్ చేస్తే .. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో ఇంటి పక్కన ఖరీదైనా 100 కోట్ల రూపాయల లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది ఈమె.

ఇక ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక… ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీపికా పదుకొణె, ఆమె భర్త రణవీర్ సింగ్ ఇండియాలోనే అత్యుత్తమ ఇళ్లల్లో ఒకటిగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ‘మన్నత్’ ఇంటి పక్కనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతం అయిన బాంద్రాలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటి విస్తీర్ణం 11,266 చదరపు అడుగులు. ఈ ఇంటి టెర్రస్ 1400 చదరపు అడుగుల వెడల్పుతో ఉంటుందట. ఇది అపార్ట్మెంట్ ఇల్లు. మొత్తం నాలుగు అంతస్తులు. దీపికా, రణ్‌వీర్ సింగ్ 16వ అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు ఉన్న ఇంటిని కొనుగోలు చేశారని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారని.. బాలీవుడ్ న్యూస్. అంతేకాదు ఈ ఇంటి కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని బీటౌన్‌లో టాక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా

విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో

‘బాగా పొగరు’.. నిత్యా చేసిన పనిపై నెటిజన్స్ మండిపాటు

పవన్‌, నాగబాబు.. ఇంట్లో ఏం చేసేవారో బయటపెట్టిన చరణ్‌