AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbha Mela:మహా కుంభలో సందడి చేస్తోన్న నాగ సాధువులు.. ఆడ నాగ సాధువు బట్టలు ధరించే విషయంలో నియమాలున్నాయని తెలుసా..

మహాకుంభ 2025 వేడుక సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. ఈ వేడుకలో లక్షలాది మందు భక్తులు, నాగ సాధువులు, అఖారాలు గంగలో స్నానం చేయడానికి ఇక్కడకు చేరుకున్నారు. వీరిలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీరిలో మహిళా నాగ సాధువులు కూడా ఉన్నారు. ఈ రోజు మనం మహిళా నాగ సాధువుల జీవన విధానం గురించి ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

Maha Kumbha Mela:మహా కుంభలో సందడి చేస్తోన్న నాగ సాధువులు.. ఆడ నాగ సాధువు బట్టలు ధరించే విషయంలో నియమాలున్నాయని తెలుసా..
Female Naga Sadhu
Surya Kala
|

Updated on: Jan 13, 2025 | 11:45 AM

Share

ప్రయాగరాజ్‌లో మహాకుంభ మొదలైంది. ఈ రోజు జరుగుతున్న తొలి అమృత స్నానం చేయడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. లక్షల మంది నాగ సాధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ రోజు మనం మహిళా నాగ సాధువుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం.. చాలా మంది సాధువులు దుస్తులు ధరిస్తారు. అయితే కొంతమంది మాత్రం బట్టలు లేకుండా ఉంటారు. వీరిని దిగంబరులు అని పిలుస్తారు. అలాంటి వారిలో నాగ సాధువులు ఒకరు.. వీరు దిగంబరులుగా జీవిస్తారు. వీరిలో ఆడ నాగ సాధువులు కూడా ఉన్నారు. కానీ వీరి జీవన విధానం నాగ సాధువులకు కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరి బట్టలు ధరిస్తారు.అయితే ఏక వస్త్రాన్ని మాత్రమే ధరించడానికి అనుమతించబడతారు. దాని రంగు గురుయా. అంతేకాదు మహిళా నాగ సాధువులు తమ నుదుటిపై తిలకం తప్పని సరిగా పెట్టుకోవాలి.

కుట్టని బట్టలు ధరించాలి

స్త్రీ నాగ సాధువులు కుట్టని వస్త్రాన్ని ధరిస్తారు. దీనిని గంటి అంటారు. నాగ సాధువు కావడానికి ముందు మహిళ 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. మహిళలు ఇలా చేసిన తర్వాత మహిళా గురువు ఆ స్త్రీని నాగ సాధువులుగా మారడానికి అనుమతిస్తారు.

జీవించి ఉండగానే పిండ ప్రదానం చేసుకోవాలి

నాగ సాధు దేవుడి ధ్యానంలో పూర్తిగా మునిగిపోయినట్లు.. దేవుడి ధ్యానంలో జీవిస్తానని నిరూపించుకోవాలి. అందుకనే ప్రాపంచిక అనుబంధాలతో అనుబంధం ముగిసినట్లు కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది. మహిళా నాగ సాధు స్వయంగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాలి. తద్వారా తనకంటూ ఓ జీవితం ఉందని మరచి గత జీవితాన్ని విడిచిపెట్టాలి. స్త్రీలను సన్యాసులుగా మార్చే ప్రక్రియను అఖారాల అత్యున్నత అధికారి ఆచార్య మహామండలేశ్వరుడు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

రోజంతా దేవుని నామ స్మరణ

మహిళా నాగ సాధువులు తెల్లవారుజామున నదిలో స్నానం చేస్తారు. దీని తరువాత మహిళా నాగ సాధు ధ్యానం ప్రారంభిస్తారు. అవధూత రోజంతా భగవంతుని జపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి శివపూజ చేస్తుంది. సాయంత్రం దత్తాత్రేయుడిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.