Maha Kumbh: ప్రారంభమైన మహా కుంభ వేడుక.. మొదటి రాజ స్నానం కోసం పోటెత్తిన భక్తులు..

ఎప్పుడెప్పుడా అని భక్తిశ్రద్దలతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 12 ఏళ్ల తర్వత ప్రరాగరాజ్ లో మహా కుంభ జాతర ఈ రోజు రాజ స్నానంతో మొదలయింది. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పూజలతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7.30గంటల వరకే 35లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్ రాజ్ అధికారులు తెలిపారు. అంతేకాదు మహా కుంభ మొదటి రోజే కోటి మందికిపైగా భక్తులు గంగా స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు.

Maha Kumbh: ప్రారంభమైన మహా కుంభ వేడుక.. మొదటి రాజ స్నానం కోసం పోటెత్తిన భక్తులు..
Maha Kumbh Begins In Prayag
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2025 | 10:32 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా వేడుక ఘనంగా ప్రారంభమైంది. త్రివేణీ సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానమాచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. పుష్య మాసం పౌర్ణమి రోజున ఈ మహా కుంభ మొదలు కావడం మాత్రమే కాదు ఈ రోజు మొదటి రాజ స్నానం. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళాలో సాధువుల 13 అఖాడాలు కూడా పాల్గొననున్నాయి. పంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభ 45 రోజుల పాటు సాగనుంది.. పిబ్రవరి 25 వ తేదీన మహా శివరాత్రి రోజున రాజ స్నానంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచయి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసింది యుపీ సర్కార్.

ప్రయాగ్ రాజ్ సహా కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ మహా కుంభలో రికార్డ్ స్థాయిలో సుమారు 40 కోట్ల మంది యాత్రికులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎటువంటి సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు భక్తులు కుంభ మేళా పరిసర ప్రాంతాల్లో ఉండగలిగేలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. నదిలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేక తేలియాడే పోలీసుస్టేషన్‌ మాత్రమే కాదు.. అకస్మాత్తుగా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే భక్తుల రక్షణ కోసం నీటిలో తెలియాడే అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. నదిలో చిన్న చిన్న పడవలపై ప్రయాణిస్తూ భద్రతా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్‌ చేస్తున్నారు.

భక్తుల భద్రత కోసం NDRF , ఉత్తరప్రదేశ్ వాటర్ పోలీసుల బృందాలు వివిధ ప్రదేశాలలో మోహరించారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేదుకు.. భద్రత కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. సంగం మేళా ప్రాంతానికి జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ప్రవేసించే విధంగా ఏర్పాటు చేశారు.. అదే విధంగా సంగ మేళా ప్రాంతం నుంచి బయటకు రావడానికి త్రివేణి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే కుంభ మేళా రాజ స్నానం సమయంలో సందర్శకులకు అక్షయవత్ దర్శనం మూసివేయనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..