Venkatesh: బోలెడంత వినోదం ఉంది.. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. హీరో వెంకటేశ్..
తెలుగు చిత్రపరిశ్రమలో హీరో వెంకటేశ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎప్పుడూ సరికొత్త చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెంకీ స్టైలే వేరు. గతేడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన వెంకటేశ్.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రేపు (జనవరి 14న) థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా తమ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు వెంకటేశ్. అన్ని చిత్రాలకు భిన్నంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా పోస్టర్స్ దగ్గర్నుంచి టీజర్, ట్రైలర్ వరకు ప్రతి విషయం సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు యూట్యూబ్ లో గోదారి గట్టు మీద సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో వెంకీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు వెంకటేశ్.
వెంకటేశ్ మాట్లాడుతూ.. “ఇది నా 76వ సినిమా. అనిల్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. ఇందులో బోలెడంత వినోదం ఉంది. అనిల్ ప్రతి సీన్ ను అద్భుతంగా తెరెక్కించారు. కుటుంబంతో కలిసి థియేటర్లలో సినిమా చూడండి. హాయిగా నవ్వుకుంటారు” అని అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చాలా విభిన్నమైన అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే కామెడీ ఉంది. ఇది నా కెరీర్ లో బెస్ట్ ఎంటర్టైనర్ అవుతుంది” అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వెంకటేశ్ స్వయంగా పాట పాడి అభిమానులను అలరించారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..