13 January 2025

50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్లు తీసుకున్న హీరోయిన్.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ఇప్పటివరకూ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే రికార్డ్ బ్రేక్ చేసింది. 50 కోట్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకుందట.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. కేరళలకు చెందిన ఆమె తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతుంది. 

రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తెలుగు, తమిళ భాషలలో ఎక్కువగా కనిపించింది.

జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాద్ షా షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన  ఈసినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

2018లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రెటీల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ హీరోయిన్ ఆమె. నయన్ ఆస్తులు రూ.180 కోట్లకు పైగానే ఉన్నాయట

20 ఏళ్లలో దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులు అందుకుంది. యాంకర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోయిన్ గా మారింది. 

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటుంది నయన్. ఇటీవల 50 సెకన్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట.