Nayanthara : కనీసం క్షమించమని కూడా అడగలేదు.. నయనతార తీరుపై తీవ్ర విమర్శలు.. ఏం జరిగిందంటే..

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా కొన్నిరోజులుగా వివాదాల్లో నయనతారతోపాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా వీరిద్దరి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

Nayanthara : కనీసం క్షమించమని కూడా అడగలేదు.. నయనతార తీరుపై తీవ్ర విమర్శలు.. ఏం జరిగిందంటే..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2025 | 9:10 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార చివరిసారిగా జవాన్ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. గత కొన్నిరోజులుగా నయనతారతోపాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పెళ్లి డాక్యుమెంటరీ విడుదల విషయంలో నటుడు ధనుష్‌ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా నానుమ్ రౌడీ సినిమాలోని క్లిప్స్ వాడినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపించాడు. దీంతో అతడిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది నయన్. దీంతో అటు ధనుష్ ఫ్యాన్స్ సైతం నయనతార వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమిళ్ చిత్రపరిశ్రమలోని మరికొందరు నిర్మాతలు, డైరెక్టర్ నయన్ జంటపై విమర్శలు గుప్పించారు. తాజాగా తమిళనాట నయనతార నిర్వహించిన ఓ ఈవెంట్‌కు సంబంధించి సైబర్‌స్పేస్‌లో మళ్లీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నయనతార ఫెమీ 9 పేరుతో ప్రారంభించిన వ్యాపార సంస్థకు సంబంధించి ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఆహ్వానించి ఓ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి నయనతార ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఇది సైబర్‌స్పేస్‌ను ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది యూట్యూబర్‌లు, అభిమానులు నయన్ తీరును ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి నయనతార ఉదయం తొమ్మిది గంటలకు వస్తుందని ప్రకటించారు. కానీ స్టార్ మరియు విఘ్నేష్ శివన్ మూడు గంటలకు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు ముగియాల్సిన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో ఈవెంట్‌కు వచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్‌పై తీవ్ర ప్రభావం పడిందని తమిళ మీడియా పేర్కొంది. చాలా మంది రైళ్లు, బస్సులు బుక్ చేసుకున్నా అవి మిస్ అయ్యే పరిస్థితి నెలకొంది.

అంతేకాదు మిగిలిన ఫోటోలు తీయడం వగైరా అంటూ చాలా యాటిట్యూడ్ చూపించారని అంటున్నారు. నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ ద్వారా పంచుకున్న చిత్రాల క్రింద ఇవే విషయాలు చెప్పారు ‘ఈ ప్రేమ చాలు. మా Femi9 కుటుంబం పెద్దదవుతోంది. మీకు మరిన్ని ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. వేడుకకు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ తన అభిమానులను క్షమించాలని కూడా కోరడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..