Allu Arjun: నా హృదయంలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.. ఆ రోజులను గుర్తుచేసుకున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతుంది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 1900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన హృదయంలో ఓ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్ చేశారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2020లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. త్రివిక్రమ్ డైలాగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఆకట్టుకున్నాయి.. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో నివేదా పేతురాజ్, టబు, సుశాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితోపాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
అల వైకుంఠపురములో సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రూ.2000 కోట్ల మార్క్ చేరువలో దూసుకుపోతుంది.
5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq
— Allu Arjun (@alluarjun) January 12, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..