Prabhas: అయ్యా బాబోయ్.. ఆ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. పౌర్ణమి సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.. ?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కొన్నాళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్ చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు
ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ప్రేక్షకులు చాలా ఇష్టమైన సినిమా పౌర్ణమి. ఈ సినిమాకు తెలుగు అడియన్స్ మదిలో ప్రత్యేక స్థానం ఉంది. క్లాసికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ రూపొందించిన ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ ఆకట్టుకుంది. ఇక ఇందులో ప్రభాస్ సరసన మరోసారి త్రిష కథానాయికగా నటించగా.. హీరోయిన్ ఛార్మీ సెకంక్ హీరోయిన్ గా కనిపించింది.. ముఖ్యంగా ప్రభాస్, ఛార్మి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ సింధు తులానీ సైతం కీలకపాత్ర పోషించింది. ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. త్రిష, ఛార్మీ, సింధు తులానీ కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె పేరు మధు శర్మ. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు . కానీ ఇందులో ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహని పాత్రలో నటించి కనిపించింది మధు శర్మ.
ముంబైకి చెందిన మధు శర్మ.. పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ పౌర్ణమి సినిమాతోనే తెలుగులో ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న మధు శర్మకు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ అవకాశాలే వచ్చాయి.. గురు పర్వాయ్ సినిమాతో తమిళ్ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది. . విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.. అలాగే అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో కనిపించింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపించి మెప్పించింది.
శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మా వంటి చిత్రాల్లో నటించిన మధు శర్మకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో సినిమాలకు పూర్తిగా దూరమైన మధుశర్మ.. ప్రస్తుతం హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..