ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

ఐరన్ లో వండిన వంటలు ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటాయి. అయితే, పుల్లని పదార్థాలు, వంకాయ, పాలకూర వంటి పదార్థాలను వండకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఐరన్ లో చేయడం వల్ల ఆహారంలో రంగు, రుచి మార్పును కలిగిస్తాయి. గుడ్లు, బీట్రూట్ వంటి పదార్థాలు కూడా ఐరన్ కడాయిలో ఉపయోగించకపోవడం మంచిది. ఐరన్ కడాయిని వాడటానికి ముందు సరైన రీతిలో క్లీన్ చేయడం అవసరం.

ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?
Cooking In Iron Pans
Follow us
Prashanthi V

|

Updated on: Jan 13, 2025 | 1:05 PM

ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఐరన్ ప్యాన్ లు, ఐరన్ కడాయిలే వినియోగించేవారు. ఎందుకంటే ఈ కడాయిలో వండే వంటల రుచి ప్రత్యేకంగా ఉంటుందని దీంట్లో చేసేవాళ్లు. ప్రస్తుత కాలంలో నాన్‌స్టిక్ ప్యాన్లు అందుబాటులో ఉన్నా కూడా మళ్లీ పాత ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. మళ్లీ ఇనుప కడాయిలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే, ఇనుప కడాయిలతో కొన్ని రకాల ఆహారాలను వండకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్లని ఆహారాలతో జాగ్రత్త

టొమాటో, చింతపండు, నిమ్మరసంతో కూడిన ఏ వంటలు అయినా సరే ఐరన్ కడాయిలో వండడం మంచిది కాదు. ఇవి ఎక్కువ ఎసిడిటీ కలిగి ఉండడంతో ఐరన్ ఆహారంలోకి చేరి, ఆహారానికి రంగు, రుచి మారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వంకాయ, పాలకూర వంటి పదార్థాలు కూడా ఐరన్ కడాయిలో చేయకపోవడం మంచిది. వంకాయలో ఉన్న ఎసిడిటీ, అలాగే పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ వల్ల వంటలో నలుపు రంగు రావడం, లోహపు రుచి కలుగుతుంది.

ఎగ్స్, బీట్రూట్

కోడిగుడ్ల తెల్లసొనలో ఉండే సల్ఫర్, ఐరన్ తో రసాయన చర్యకు గురవుతుంది. పైగా కలర్ కూడా ఛేంజ్ అవుతుంది. ఇది మీ వంట రుచిని కూడా తగ్గిస్తుంది. అలాగే బీట్రూట్‌లో సహజంగా ఉన్న అధిక ఐరన్, ఐరన్ కడాయితో రియాక్ట్ అవుతుంది. దీని కారణంగా ఆహారం సహజ రుచిని కోల్పోయే ప్రమాదం ఉంది. పిండితో తయారైన పాస్తా వంటి పదార్థాలు కూడా ఐరన్ కడాయి అడుగుకి అతుక్కుపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది.

స్వీట్ ఐటమ్స్

తీపి వంటకాలను ఐరన్ కడాయిలో తయారు చేయడం వల్ల వాటి టేస్ట్, స్మెల్ ఛేంజ్ అవుతాయి. ఐరన్ తో కలిసిన పదార్థాలు స్వీట్ ఐటమ్స్ కి అసహజమైన రుచి తెస్తాయి. కాబట్టి స్వీట్ ఐటమ్స్ కోసం ప్రత్యేకమైన పాత్రలు వాడడం మంచిది.

ఐరన్ కడాయి పట్ల కేర్ అవసరం

ఐరన్ కడాయి కొన్న తర్వాత దాన్ని వాడటానికి ముందు సరైన కేర్ తీసుకోవడం అవసరం. మొదట ఆయిల్ అప్లై చేసి మంచిగా క్లీన్ చేసుకోవడం అవసరం. ఇలా చేస్తుండగా కడాయికి ఉన్న మురికి తొలగించడానికి సహాయపడుతుంది. వంట సమయంలో ఐరన్ వంటల్లోకి ఎంత చేరుతుందనేది కడాయిని ఎలా ఉపయోగిస్తున్నామో, వండే ఐటమ్స్ రియాక్షన్ ఏంటో, అలాగే కడాయి కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఐరన్ కడాయిలను వాడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.