ఈ సుకుమారి స్పర్శకై ఆ తారలు నేలకు దిగిరావా.. గార్జియస్ రియా.. 

13 January 2025

Prudvi Battula 

Credit: Instagram

1 జూలై 1992న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రియా చక్రవర్తి.

ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీ అధికారి. అంబాలాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ అంబాలా కాంట్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది.

2009లో MTV ఇండియాలో TVS స్కూటీ టీన్ దివాతో తన టెలివిజన్ కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇందులో మొదటి రన్నరప్‌గా నిలిచింది.

తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని MTVలో వీడియో జాకీగా ఆడిషన్ చేసి ఎంపికై ఇక్కడ పనిచేసింది ఈ ముద్దుగుమ్మ.

పెప్సీ వాసప్, టిక్‌టాక్ కాలేజ్ బీట్ మరియు MTV గాన్ ఇన్ 60 సెకన్లతో సహా అనేక MTV షోలను హోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

2012లో సుమంత్ అశ్విన్ సరసన తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి.

2013లో మేరే డాడ్ కి మారుతి అనే ఓ హిందీ చిత్రంలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ అందాల భామ.

తర్వాత మరికొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించింది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయట్లేదు ఈ ముద్దుగుమ్మ.