ఆ సొగసరి సోయగానికి ఆ మన్మధుడు దాసుడు.. సిజ్లింగ్ ఐశ్వర్య..
12 January
202
5
Prudvi Battula
Credit: Instagram
6 సెప్టెంబర్ 1991న కేరళలోని అనంత పద్మనాధుని నగరం తిరువనంతపురంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య లక్ష్మి.
త్రివేండ్రంలో తన పాఠశాల విద్యను హోలీ ఏంజెల్స్ కాన్వెంట్, త్రిస్సూర్‌లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది.
ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుంచి MBBS డిగ్రీ పట్టా పొందింది. అక్కడే తన ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసింది.
మోడలింగ్ లో తన కెరీర్ మొదలుపెట్టింది. ఫ్లవర్ వరల్డ్, సాల్ట్ స్టూడియో, వనిత, FWD లైఫ్ వంటి మ్యాగజైన్‌ల కవర్‌లపై కనిపించింది.
చెమ్మనూర్ జ్యువెలర్స్, కరికినేత్ సిల్క్స్, లా బ్రెండా, ఎజ్వా బోటిక్, అక్షయ జ్యువెల్స్, శ్రీ లక్ష్మి జ్యువెలరీ మొదలైన బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేసింది.
మలయాళీ ఫ్యామిలీ డ్రామా సినిమా నందుకలుడే నత్తిల్ ఒరిదవేలాలో ప్రముఖ పాత్రతో చలనచిత్ర అరంగేట్రం చేసింది.
2019లో యాక్షన్ అనే సినిమాతో తొలిసారి తమిళంలో నటించింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది.
2022లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్సే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. అదే ఏడాది అమ్ము అనే చిత్రంలో ప్రధానపాత్రలో ఆకట్టుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈమె వంటి సొగసు భువి యందు కనపడునా.. సిజ్లింగ్ రాశి..
ఈ కోమలి అందాన్ని తాకిన గాలి పులకరించిపోదా.. స్టన్నింగ్ ప్రగ్య..
దివి నుంచి జారిన తార ఈ ముద్దుగుమ్మలా మరి ఉంటుంది.. గార్జియస్ పావని..