BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
తన దూకుడు స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంతో కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం రసాభాసాగా మారింది. కాగా, ఈ ఘటనతో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.
నిన్న కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజయ్ దగ్గరకు వెళ్లారు కౌశిక్ రెడ్డి. ఏ పార్టీ నీదంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువుర్ని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ పీఏ ఫిర్యాదుతో మొదటి కేసు నమోదు కాగా.. సమావేశంలో గందరగోళానికి కారణమై, పక్కదారి పట్టించారాని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు రెండో కేసు నమోదు చేశారు. ఇక తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన పిర్యాదుపై మూడో కేసు నమోదు అయింది.
ఇది చదవండి: సంక్రాంతి జాతర.. ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలిస్తే బిత్తరపోతారు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి