ఈ వారం డిజిటల్ వేదికగా స్ట్రీమ్ కానున్న చిత్రాలు ఇవే.. 

13 January 2025

Prudvi Battula 

స్పీక్ నో ఈవిల్ అనే ఓ హాలీవుడ్ హారర్ డ్రామా సినిమా జనవరి 13 నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఛిడియా ఉడ్ అనే హిందీ థ్రిల్లర్ జనవరి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్ఎక్స్ ప్లేయర్ రెండింటిలో స్ట్రీమ్ కానుంది.

సోనీ లివ్ వేదికగా జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది మాలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం పాని. జోజు జార్జ్ ఇందులో హీరో.

విజయ సేతుపతి ప్రధానపాత్రలో తెరకెక్కిన విడుతలై పార్ట్ 2 జీ5 వేదికగా జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఐయామ్ కథలన్ అనే ఓ మలయాళ కామెడీ సినిమా మనోరమ మ్యాక్స్‎లో డిజిటల్ వేదికగా జనవరి 17 నుంచి ప్రసారం అవుతుంది.

బ్యాక్ ఇన్ యాక్షన్ అనే ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డైరెక్ట్ ఓటీటీలో జనవరి 17 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

ఐ వాంట్ టు టాక్ అనే ఓ హిందీ థ్రిల్లర్ డ్రామా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 17 నుంచి స్ట్రీమింగ్‎కి సిద్ధంగా ఉంది.

హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) లయన్స్ గేట్ ప్లేలో జనవరి 17న స్ట్రీమ్ కానుంది.