AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ మేళాలో ప్రధాన ఆకర్షణగా పావురం బాబా.. ప్రతి జీవిలో శివయ్య ఉంటాడని చెప్పాలనే లక్ష్యంతో..

ప్రయగరాజ్ లో త్రివేణీ సంగమం వద్ద మహా కుంభ అంగరంగ వైభవంగా మొదలైంది. తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తున్నారు. అయితే ఈ మహా కుంభకు వచ్చే యాత్రికులకు చోటా బాబా, చాబీ బాబా, పావురం బాబా వంటి సాధువులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మహాకుంభానికి వచ్చిన యాత్రికులు పావురం బాబాను చూడాలని.. అయన గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రాపంచిక, అతీంద్రియ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా పావురం బాబా సొంత జీవిత లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది. సృష్టిలో ప్రాణులకు చేసే సేవే గొప్ప సేవ అని బాబా చెప్పారు.

కుంభ మేళాలో ప్రధాన ఆకర్షణగా పావురం బాబా.. ప్రతి జీవిలో శివయ్య ఉంటాడని చెప్పాలనే లక్ష్యంతో..
Kabutar Wale Baba
Surya Kala
|

Updated on: Jan 13, 2025 | 1:16 PM

Share

మహాకుంభలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు ప్రయాగరాజ్ కు చేరుకున్నారు. వీరిలో జునా అఖారాకు చెందిన పావురం వాలే బాబా ఒకరు. రాజస్థాన్‌కు చెందిన బాబా పావురం వాలే బాబా అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఎందుకంటే అతను గత కొన్ని ఏళ్లుగా పావురాన్ని తలపై పెట్టుకుని తిరుగుతున్నాడు. మహాకుంభానికి వచ్చే యాత్రికులు బాబాను చూడగానే వెంటనే ఆయన గురించి తెలుసుకోవాలనే కుతూహలం చూపిస్తున్నారు. ఇహ పరలోక విషయాలకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ బాబా తనకు జీవులకు సేవ చేయడమే లక్ష్యం అని .. ప్రతి జీవిలో దైవం ఉన్నాడని బాబా చెప్పారు.

జీవులకు సేవ చేయడం సర్వోన్నతమైన మతం అని.. జీవులకు సేవ చేయాలి. ఇది ఒక్కటే తన లక్ష్యం అని పావురం వాలే బాబా చెప్పారు. సమస్త ప్రాణులకు సేవ చేయండి.. జీవులలో శివుడు ఉన్నాడని చెప్పారు. ఆవు, గోరు, నంది, మూడు సేవలు అత్యంత విశిష్టమైన సేవలు.. మిగిలినవన్నీ అబద్ధం. ఏది చేసినా.. ఏ తంత్ర సాధన చేసినా.. గోవులకు సేవ చేసినా అంతా సాధనే అవుతుందని అన్నారు,

అంతేకాదు ఇంకా బాబా మాట్లాడుతూ తంత్ర మంత్రం సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో.. అదే విధంగా ఎవరు గోవుకు సేవ చేస్తారో వారికి కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెప్పారు. జీవులకు సేవ చేయడమే పరమ ధర్మం.. ప్రతి జీవిలో శివుడిని చూస్తూ… జీవులకు సేవ చేయమని తెలియజేసేందుకే ఇలా గత 9 ఏళ్ళుగా పావురాన్ని తలపై మోసుస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

పావురం బాబాది రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్. బాబా తరచుగా భక్తులకు.. జీవులకు సేవా గురించి బోధలను ప్రబోధించడం కనిపిస్తుంది. అతనిని.. అతనికి పెంపుడు పావురాన్ని చూసేందుకు జనం పోటీపడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.