- Telugu News Photo Gallery Spiritual photos According to Hindu belief, if the milk overflows in Sankranti pot in which direction, benefits.?
Sankranthi: సంక్రాంతికి కుండలో పాలు ఏ దిశలో పొంగితే.. ఎలాంటి లాభం.?
సంక్రాంతి పండగ రోజు ఇళ్లలో పాలు పొంగించే సాంప్రదాయం చాలాకాలం నుంచి కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే పండగ వేల పొంగించిన పాలు ఏ దిశలో కిందపడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా.? ఈరోజు దీని గురించి మనం తెలుసుకుందాం రండి..
Updated on: Jan 13, 2025 | 2:10 PM

హిందువులు పెద్ద పండగ అంటూ చెప్పుకొనే సంక్రాంతి మొదటి రోజున కొత్త బియ్యంతో పాయసం, పొంగల్ వంటి వంటకాలు చేస్తారు. దీని కోసం కొత్త కుండను తీసుకొని చుట్టూ పసుపు దారం, పూలదండను కట్టి, విభూతి, పసుపు, కుంకుమ పూసి అలంకరించి తర్వాత నీటితో నింపి వ్యవసాయ భూమిని ఇచ్చిన ఇంద్రుడు, సూర్యభగవానుడిని సంక్రాంతికి పూజిస్తారు. వ్యవసాయానికి సహాయపడిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు.

పాయసం వండటానికి ముందు కొండలో పాలను పొంగే కింద పడే వరకు మరిగిస్తారు. కుండలో పాలు పొంగి కింద పడిన దిశను బట్టి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. దాన్ని బట్టి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అని హిందువుల నమ్మకం.

మీరు గిన్నె లేదా కుండలో మరిగించే పాలు పొంగి తూర్పూ దిక్కువైపు కిందపడుతుంటే ఆ ఏడాది కొత్త ఇల్లు, భూమి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థమని చెబుతున్నారు హిందూ పండితులు.

అదే విధంగా మీరు పొయ్యిపైన మరిగించి పాలు కుండ నుంచి పడమటి దిశలో పొంగినట్లైతే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలకి మంచి సంబంధాలు దొరుకుతాయని నమ్మకం.

అది గిన్నెలో పాలు ఉత్తర దిశ వైపు పొంగినట్లైతే ఇంట్లో సంపద, ఐశ్వర్యం, ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే పదోన్నతి, జీతాలు పెరగటం వంటివి జరుగుతాయి. అలాగే ఇంట్లో నిరుద్యోగులుగా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి.

అలాగే కుండ నుంచి దక్షిణ దిక్కువైపు పాలు పొంగితే మాత్రం ఆ ఏడాది ఎక్కువగా వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది. అవివాహితులకు వివాహంలో న్యాయపరమైన జాప్యం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా వహించాలి.




