- Telugu News Photo Gallery Cinema photos Will jr ntr hrithik roshan dance in war 2 be like RRR natu natu song
War2: వార్ 2 లో హృతిక్, తారక్ డాన్స్ పీక్స్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
టెన్షన్‌గా ఉందంటున్నారు హృతిక్. అరే.. టెన్షన్ మాకు కదా బాస్ ఉండాల్సింది.. మీకెందుకు? అని అంటున్నారు ఫ్యాన్స్. నార్త్ ఆడియన్స్ మరో అడుగు ముందుకేసి.. నో ఫికర్.. హాయిగా ఉండండి... అంటూ తమకు నచ్చినట్టు ఎడిట్స్ చేసేసుకుంటున్నారు. అవన్నీ ఓకే... తారక్ గురించి హృతిక్ ఇంకేమేం చెప్పారు?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Apr 08, 2025 | 6:31 PM

తను సూపర్బ్ కోస్టార్. నేనిప్పటిదాకా చాలా మందితో పనిచేశాను. కానీ, తారక్ సింప్లీ సూపర్బ్.. ఇవి హృతిక్ చెప్పిన మాటలు. అంతే కాదు.. తారక్ బ్రిల్లియంట్ కోస్టార్ అని మెచ్చుకున్నారు.

ఫైన్ టీమ్ మేట్‌తో కలిసి తాను చేసిన పనిని ఆగస్టు 14న మిస్ కావద్దంటున్నారు హృతిక్. అందరూ ఆగస్టు 14 కోసం వెయిట్ చేస్తుంటే, అంతకు మించి ఎగ్జయిట్‌మెంట్ కలిగించే విషయాన్ని షేర్ చేసుకున్నారు హృతిక్.

సినిమాకు సంబంధించి ఇంకో పాట మిగిలి ఉందన్నారు. అందులోనూ తారక్, తానూ కలిసి స్టెప్పులేయాలన్నారు. హృతిక్ అలా చెప్పారో లేదో.. వెంటనే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు వీళ్లిద్దరి స్టెప్పులతో ఎడిట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.

నాటు నాటు సాంగ్‌ని చూసిన తర్వాత, ఆ రేంజ్ స్టెప్పులున్న సాంగ్ ఇది అంటూ ఇప్పటిదాకా ఏ సాంగ్‌నీ క్లెయిమ్ చేసుకోలేదు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. మళ్లీ ఇప్పుడు ఆ ఛాన్స్ వార్2 మేకర్స్ కే ఉందంటున్నారు క్రిటిక్స్. నార్త్ లో హృతిక్‌కి బెస్ట్ డ్యాన్సర్‌గా పేరుంది. మన దగ్గర తారక్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు.

ట్రిపుల్ ఆర్ తర్వాత దేవరతో సక్సెస్ అందుకున్నారు తారక్. ఇప్పుడు వార్2 కూడా సూపర్ సక్సెస్ అయితే, ఇక ఆయన కెరీర్‌కి నార్త్ లోనూ తిరుగు ఉండదన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. దీనికి తోడు వరుస లైనప్ కూడా ఊరిస్తోంది. సో, ప్రాజెక్ట్ సెలక్షన్ టు ప్రమోషన్ల వరకు.. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలని తారక్ కి వెల్ విషర్స్ నుంచి సలహాలు అందుతున్నాయి.





























