Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్‌లక్ బ్యాక్ పాకెట్‌లో పెట్టుకుని తిరుగుతున్న హీరో.. ఏ మాత్రం తగ్గని కష్టాలు

బ్యాడ్‌లక్ బ్యాక్ పాకెట్‌లో పెట్టుకుని తిరుగుతుంటే.. హిట్టు రమ్మంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి..? మంచి సినిమా చేసినా.. వసూళ్లు రాకపోతే పాపం ఆ హీరో అయినా ఏం చేస్తాడు నిట్టూర్చడం తప్ప. తాజాగా ఓ స్టార్ హీరో పరిస్థితి అలాగే ఉంది. టాక్ బాగున్నా.. కలెక్షన్స్ లేక కెరీర్ విషయంలో కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. ఇంతకీ ఆయనెవరో తెలుసా..?

Phani CH

|

Updated on: Apr 08, 2025 | 5:38 PM

విక్రమ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఒకప్పుడు ఈయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. అదిరిపోయే కంటెంట్‌తో వచ్చినా కూడా ఆడియన్స్ చూస్తారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

1 / 5
విక్రమ్ ట్రాక్ రికార్డ్ అలా పడిపోయిందిప్పుడు. వీర ధీర సూరన్ సినిమానే దీనికి నిదర్శనం. విక్రమ్ గత సినిమాలతో పోలిస్తే వీర ధీర సూరన్‌కు చాలా మంచి టాక్ వచ్చింది.. దర్శకుడు అరుణ్ కుమార్ కొత్తగా ట్రై చేసారు.. ఒక్క రాత్రిలోనే జరిగే కథ ఇది.. విక్రమ్ కూడా తనదైన నటనతో అదరగొట్టారు.

2 / 5
ఎలివేషన్స్ లేకుండా సింపుల్‌గా నటించారు. పైగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు విక్రమ్. ఇంత చేసినా సినిమాకు సరైన వసూళ్లు రావట్లేదు. సరైన ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది వీర ధీర సూరన్.

3 / 5
దాంతో తమిళంలోనే దీనికి ఊహించిన వసూళ్లు రావట్లేదు.. ఇక తెలుగులో అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కంటెంట్ బాగున్న సినిమాలకు కూడా కలెక్షన్స్ రాకపోవడంతో విక్రమ్‌కు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదిప్పుడు.

4 / 5
ప్రతీ సినిమా కోసం ప్రాణం పెడుతుంటారీయన. విక్రమ్‌ డేట్స్ ఇస్తే కమర్షియల్ సినిమా కంటే.. ప్రయోగం చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు దర్శకులు. ఇకపై ఎక్స్‌పర్మెంట్స్ చేయనంటూనే.. ప్రతీసారి అదే చేస్తుంటారు విక్రమ్. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారు ఈ హీరో.  మొత్తానికి మరి చూడాలిక.. విక్రమ్ కోరుకుంటున్న ఆ కమర్షియల్ హిట్ ఎప్పుడొస్తుందో..?

5 / 5
Follow us