- Telugu News Photo Gallery Cinema photos Will Jabardasth fame help Sudigali Sudheer in next movie Calling Sahasra
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సక్సెస్ అవుతాడా.. జబర్దస్త్ ఇమేజ్ పని చేస్తుందా ??
వారం వారం టీవీలో వచ్చి నవ్వించడం వేరు.. అక్కడ ఏం చేసినా నవ్వుతారు. కాస్త ఇమేజ్ వచ్చిందంటే చాలు.. ఏం కామెడీ చేసినా హాయిగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వుతుంటారు. పైగా 10 నిమిషాల పాటు ఓ స్కిట్ చేసి నవ్వించడం వేరు.. ఆ ఇమేజ్ నమ్ముకుని సినిమా చేసి హీరోగా సక్సెస్ అందుకోవడం వేరు. ఇప్పుడు ఈ రెండింటికీ మధ్యలోనే ఉన్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయన ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్ మనోడు.. సుధీర్ అని పేరు కనబడగానే నవ్వులు మొహాలపై అలా వచ్చేస్తాయంతే.
Praveen Vadla | Edited By: Phani CH
Updated on: Nov 21, 2023 | 7:51 PM

వారం వారం టీవీలో వచ్చి నవ్వించడం వేరు.. అక్కడ ఏం చేసినా నవ్వుతారు. కాస్త ఇమేజ్ వచ్చిందంటే చాలు.. ఏం కామెడీ చేసినా హాయిగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వుతుంటారు. పైగా 10 నిమిషాల పాటు ఓ స్కిట్ చేసి నవ్వించడం వేరు.. ఆ ఇమేజ్ నమ్ముకుని సినిమా చేసి హీరోగా సక్సెస్ అందుకోవడం వేరు. ఇప్పుడు ఈ రెండింటికీ మధ్యలోనే ఉన్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయన ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్ మనోడు.. సుధీర్ అని పేరు కనబడగానే నవ్వులు మొహాలపై అలా వచ్చేస్తాయంతే. అంతగా తన కామెడీతో మ్యాజిక్ చేసాడు సుధీర్. నిజంగానే సుడిగాలి లాంటి పంచులతో కితకితలు పెట్టడంలో ముందుంటాడు ఈ కమెడియన్. అయితే ఈ మధ్య స్మాల్ స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్‌పై కనిపించడం అలవాటు చేసుకున్నాడు సుధీర్. అక్కడే వరస సినిమాలు చేస్తున్నాడు కూడా.

అందుకే థియేటర్‌లో ఈయన సక్సెస్ అవుతాడా.. బుల్లితెర మ్యాజిక్ వెండితెరపై కూడా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. మూడేళ్ళ కింద సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ ఓ సినిమా చేసాడు సుధీర్. థియేటర్లలో అది సక్సెస్ అయిందా లేదా అనే విషయం పక్కనబెడితే.. ఆయనతో సినిమా చేసిన నిర్మాత మాత్రం ఫుల్లుగా లాభపడ్డాడు. కేవలం సుధీర్ ఇమేజ్ చూపించి సినిమాను అమ్ముకోవడం కాదు.. టేబుల్ ప్రాఫిట్స్ కూడా అందుకున్నాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాకు అయిన బడ్జెట్ 2 కోట్ల లోపే కానీ వచ్చిన లాభాలు మాత్రం 4 కోట్ల వరకు ఉంటాయనేది ట్రేడ్ అంచనా. మరోవైపు ఈ మధ్యే గాలోడు అనే మరో సినిమా చేసాడు సుధీర్. ఇదైతే థియేటర్లలో కూడా హిట్టైపోయింది. కోటిన్నర బిజినెస్ చేస్తే.. దాదాపు 3 కోట్ల వరకు షేర్ వసూలు చేసి కోటిన్నర లాభాలు తీసుకొచ్చింది గాలోడు సినిమా. దాంతో సుడిగాలి సుధీర్ కోసం బాగానే వేచి చూస్తున్నారు నిర్మాతలు.

ముఖ్యంగా పెద్దగా బడ్జెట్ అవసరం లేదు.. ఉన్నంతలో కాస్త మాస్ సినిమా చేస్తే చాలు మనోడి ఇమేజ్‌కు డబ్బులు వచ్చేస్తున్నాయనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. ప్రస్తుతం ఈయన కాలింగ్ సహస్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. డిసెంబర్ 1న విడుదల కానుంది కాలింగ్ సహస్ర. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న కాలింగ్ సహస్రపై సుధీర్ నమ్మకాలు బాగానే ఉన్నాయి.

కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టడమే కాదు.. సోలోగా మార్కెట్ కూడా తెచ్చుకుంటానని చెప్తున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ సినిమాల పేరు చెప్పి అనసవరంగా ఉన్న బుల్లితెర కెరీర్ కూడా పాడు చేసుకుంటాడేమో అని ఫీల్ అవుతున్నారు సుధీర్ ఫ్యాన్స్. గతంలోనూ కొందరు ఇదే చేసారు కూడా.

ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ వంతు. కేవలం సుధీర్ మాత్రమే కాదు.. గెటప్ శ్రీను కూడా హీరోగా వస్తున్నాడు. ఈయన హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు రాకింగ్ రాకేష్ సైతం KCR అంటూ పొలిటికల్ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు. మొత్తానికి వీళ్ళంతా జస్ట్ హడావిడేనా.. లేదంటే మ్యాటర్ ఉన్న సినిమాలతో వస్తున్నారా అనేది చూడాలిక.





























