- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroines Now Want to Shine in Female centric Roles
Tollywood News: గ్లామర్ షో ఒక్కటే కాదు.. ఎందులోనూ తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీస్
మేమేం తక్కువ కాదు.. ఎందులోనూ మీకు మేం తీసిపోం అంటున్నారు హీరోయిన్స్. గ్లామర్ షో మాత్రమే కాదు.. అవసరమైతే సినిమాను మా భుజాలపై మోస్తాం.. మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల రేషియో పెరగడానికి కారణం కూడా అదేనా..? సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్లా అవకాశాలు రావట్లేదు. ఇప్పుడంతా శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ జమానా నడుస్తుండటంతో.. తమన్నా, అనుష్క, సమంత లాంటి సీనియర్స్‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఆప్షన్ అయ్యాయి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jul 13, 2024 | 9:52 AM

మేమేం తక్కువ కాదు.. ఎందులోనూ మీకు మేం తీసిపోం అంటున్నారు హీరోయిన్స్. గ్లామర్ షో మాత్రమే కాదు.. అవసరమైతే సినిమాను మా భుజాలపై మోస్తాం.. మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల రేషియో పెరగడానికి కారణం కూడా అదేనా..?

సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్లా అవకాశాలు రావట్లేదు. ఇప్పుడంతా శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ జమానా నడుస్తుండటంతో.. తమన్నా, అనుష్క, సమంత లాంటి సీనియర్స్‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఆప్షన్ అయ్యాయి. అందుకే వరసగా అలాంటి సినిమాలే చేస్తున్నారు మన హీరోయిన్లు. ఈ మధ్యే ఓదెల 2 సినిమాకు సైన్ చేసారు మిల్కీ బ్యూటీ.

భోళా శంకర్ తర్వాత తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోలేదు తమన్నా. సంపత్ నంది కథ అందిస్తున్న ఓదెల 2లో భాగమయ్యారు తమన్నా. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్‌లో నటించారు తమన్నా. ఇప్పుడు ఆయన కథ అందిస్తున్న ఓదెల 2లో నటిస్తున్నారు. ఆహాలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్ ఇది.

రష్మిక మందన్న సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో పాటు తెలుగులో గాళ్ ఫ్రెండ్, రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు. అనుష్క పూర్తిగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మానేసారు. నయనతార సైతం ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ కథలకే ఓటేస్తున్నారు.

పెళ్లికి ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒక్కటి కూడా చేయని కాజల్.. ఇప్పుడు మాత్రం వరసగా అవే చేస్తున్నారు. ఈ మధ్యే సత్యభామ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు చందమామ. అలాగే కీర్తి సురేష్, సాయి పల్లవి కూడా ఫీమేల్ సెంట్రిక్ వైపు అడుగులు పడుతున్నాయి. మొత్తానికి సీనియర్ హీరోయిన్లకు ఇదో బెస్ట్ ఆప్షన్ అయిపోయింది.





























