- Telugu News Photo Gallery Cinema photos Bollywood stars who attended Anant Ambani Radhika Merchant Grand wedding, Photos Here
Anant Ambani Wedding: తారలు దిగి వచ్చిన వేళ.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా.. ఫొటోస్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ తరలి వచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jul 13, 2024 | 10:11 AM

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ తరలి వచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

అనంత్ అంబానీ- రాధికల వివాహ వేడుకకు షారుఖ్ ఖాన్ దంపతులు తరలిచ్చారు. వారితో పాటు కుమర్తె సుహానా ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

ఇక అందాల తారలు జాన్వీ కపూర్, అనన్యా పాండే, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు అనంత్ అంబానీ- రాధికల పెళ్లి వేడుకల్లో మెరిశారు.

రణ్ బీర్ కపూర్- అలియా భట్ కలర్ ఫుల్ డ్రెస్ లో పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు అతియా శెట్టి, సునీల్ శెట్టి, అహాన్ శెట్టి తదితరులు కూడా సందడి చేశారు.

సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత్ ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ధోనీ, సాక్షి, జివా, జాకీ ష్రాఫ్ తదితరులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

ఇక గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ తో కలిసి ఈ వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ట్రెడిషినల్ దుస్తుల్లో తళుక్కుమన్నారీ క్యూట్ కపుల్.

ఇక జవాన్ డైరెక్టర్ అట్లీ తన సతీమణితో రాగా, సారా అలీఖాన్ తన సోదరుడితో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.