- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu To Ram Charan Tollywood Stars At Anant Ambani Radhika Merchant Grand Wedding, See Photos Here
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికల పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ తారలు.. సంప్రదాయ దుస్తుల్లో సందడి.. ఫొటోస్
అపర కుబేురుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (జులై 12) ముంబైలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jul 13, 2024 | 8:08 AM

అపర కుబేురుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (జులై 12) ముంబైలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారీ లవ్లీ కపుల్.

. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార కలిసి అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు. బ్లాక్‍కలర్ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో లాంగ్ హెయిర్‌తో మరింత హ్యాండ్‍సమ్‍గా, కొత్తగా కనిపించారు మహేశ్ బాబు.

టాలీవుడ్ హల్క్, హీరో దగ్గుబాటి రానా తన భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో తళుక్కుమన్నారు.

ఇక యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్లాక్ కలర్ ఔట్‍ఫిట్‍లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. ఇక కోలీవుడ్ నుంచి రజనీకాంత్ ఈ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.

అలాగే నయన తార- విఘ్నేశ్ శివన్ దంపతులు, సూర్య- జోతిక కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సౌత్ సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకల్లో మెరిశారు.