తల్లైనా తగ్గని అందం.. అదిరిపోయే లుక్‌లో శ్రియా శరణ్!
బ్యూటీ స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఓ బిడ్డకు తల్లైనా ఈ అమ్మడు గ్లామర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీ తాజాగా పింక్ కలర్ ఔట్ ఫిట్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Oct 15, 2025 | 6:28 PM

టాలీవుడ్ బ్యూటీ శ్రీయా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. వరసగా సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.

తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచి, అప్పడే కాదు, ఈ తరం వారికి కూడా ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా రీసెంట్‌గా మిరాయి సినిమాలో తేజా సజ్జాకు తల్లి పాత్రలో నటించి, తన నటనతో వావ్ అనిపించింది.

ఈ బ్యూటీ కరోనా తర్వాత చిత్రపరిశ్రమకు దూరమైంది. తర్వాత అందమైన పాపకు జన్మనించింది. ఇక చాలా కాలం పాటు తన పాపను చూసుకుంటూ, పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య కాలంలో మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి తెలుగు చిత్రపరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రీసెంట్ గా మిరాయి సినిమాతో వెంటితెరపై సందడి చేసింది. ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో అందరీన ఆకట్టుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా పింక్ కలర్ ఔట్ ఫిట్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్‌ను చూసెయ్యండి.



