- Telugu News Photo Gallery Cinema photos Serial actress shobha shetty emotional comments about her career beginning struggles
అమ్మ తాళి తాకట్టు పెట్టి అద్దె కట్టాం.. కష్టాలు గుర్తు చేసుకొని కన్నీళ్లుపెట్టుకున్న శోభా శెట్టి
కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపంలో విలన్ మోనితగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
Updated on: Jul 25, 2025 | 11:05 PM

కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపంలో విలన్ మోనితగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

హౌస్ లో శివాజీ బ్యాచ్ కు మాటకు మాట చెబుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్లకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామందికి ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ షోలోకి కూడా అడుగు పెట్టింది.అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ ను విజ్ఞప్తి చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

అయితే ఈ మధ్యకాలంలో టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్ లోనూ కనిపించడం లేదు శోభ. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇటీవలే సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటున్నా అని అభిమానులకు షాక్ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. కార్తీక దీపం 2 లో అవకాశం చేజారింది. అలాగే నిశ్చాతార్థం జరిగి ఏడాది గడిచింది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలుసింది. అది కూడా సాఫీగా జరగడం లేదని టాక్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ తన స్ట్రగుల్స్ గురించి చెప్పింది. కెరీర్ బిగినింగ్ లో ఆడిషన్స్ కోసం ఫోటోలు దిగడానికి కూడా డబ్బులు ఉండేవికావు అని తెలిపింది. తన తల్లి మంగళసూత్రం తాకట్టు పెట్టి బెంగళూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాం అని తెలిపింది. అలాగే ఎన్నో సార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రపోయాం అని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది శోభ శెట్టి.




