రూట్ మార్చిన రాజా సాబ్ బ్యూటీ.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారిన మాళవిక
మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.
Updated on: Jul 25, 2025 | 11:11 PM

మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.

మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్.

ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా దర్శకుడు బి. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “తంగళన్”లో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. మాళవిక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించింది.

ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ బ్యూటీ రాణిస్తుందేమో చూడాలి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ల మారింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవతార్ లో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.