- Telugu News Photo Gallery Cinema photos Nag Ashwin check the rumours on his upcoming lady oriented movie
Nag Ashwin: అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే..
ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళ జర్నీ పుణ్యమా అని నాగ్ అశ్విన్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. పనిలో పనిగా ఎవడే ముచ్చట్లతో పాటు.. కల్కి 2 సంగతులు కూడా పంచుకుంటున్నారు. కల్కి 2 సెట్స్‌పైకి వచ్చేలోపు నాగీ మరో సినిమా చేస్తాడంటూ వార్తలొస్తున్నాయి. మరి దానిపై ఆయనేం అంటున్నారు..? నిజంగానే కల్కి 2 కంటే ముందు మరో సినిమా చేస్తారా..?
Updated on: Mar 26, 2025 | 7:55 PM

కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్‌గానే ఉన్న ఈయన.. ఇప్పుడు ఏకంగా ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు నాగ్ అశ్విన్.

తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగీ. ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళ జర్నీతో మరోసారి ట్రెండ్ అవుతున్నారు ఈ దర్శకుడు.

ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఓవైపు రాజా సాబ్ చేస్తూనే.. మరోవైపు హను రాఘవపూడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు. దీని తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేయబోతున్నారు. ఈ మూడూ అయ్యాకే కల్కి 2 వైపు వస్తారు రెబల్ స్టార్.

ఇవన్నీ అవ్వడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది. ఈలోపు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తారనే వార్తలొచ్చాయి.. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటికే మహానటితో చరిత్ర సృష్టించారు నాగ్ అశ్విన్.

దాంతో కల్కి 2 వచ్చేలోపు మరో సినిమా చేస్తారనుకున్నారంతా. కానీ తన ఫోకస్ అంతా ప్రభాస్ సినిమాపైనే ఉందన్నారు నాగీ. మరో సినిమా గురించి ఆలోచించట్లేదని చెప్పారు. అన్నీ కుదిర్తే డిసెంబర్ 2025 నుంచి కల్కి 2 మొదలుపెడతామన్నారు. ఒకవేళ లేటైనా.. ఇదే తన తర్వాతి సినిమా అన్నారాయన.




