- Telugu News Photo Gallery Cinema photos Let's see what movies are coming this early summer in Tollywood
ఆగలేకపోతున్నాం అంటున్న హీరోలు.. సమ్మర్ కి ముందే సినిమాలు..
హ్యాపీ సమ్మర్..! అదేంటి ఇంకా రాలేదుగా.. మరో రెండు నెలలు టైమ్ ఉందిగా అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం చెప్పండి.. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు మన హీరోలు కూడా ముందుగానే సమ్మర్‌ను ముందుకు తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలైతే ఫిబ్రవరి, మార్చ్‌లోనే రచ్చ చేస్తున్నారు. మరి ఈ ఎర్లీ సమ్మర్ వచ్చే సినిమాలేంటో చూద్దామా..
Updated on: Feb 10, 2024 | 4:19 PM

హ్యాపీ సమ్మర్..! అదేంటి ఇంకా రాలేదుగా.. మరో రెండు నెలలు టైమ్ ఉందిగా అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం చెప్పండి.. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు మన హీరోలు కూడా ముందుగానే సమ్మర్‌ను ముందుకు తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలైతే ఫిబ్రవరి, మార్చ్‌లోనే రచ్చ చేస్తున్నారు. మరి ఈ ఎర్లీ సమ్మర్ వచ్చే సినిమాలేంటో చూద్దామా..

సాధారణంగా సినిమాలకు సంక్రాంతి.. ఆ తర్వాత సమ్మర్‌ను మించిన సీజన్ ఉండదు. కానీ అదేంటో మరి.. మన నిర్మాతలు మాత్రం ఎగ్జామ్స్ పీరియడ్ అయిన ఫిబ్రవరి, మార్చ్‌లోనే సినిమాలకు పరీక్షలకు పంపిస్తున్నారు. బంగారం లాంటి ఎప్రిల్, మే వదిలేసి.. ఎర్లీ సమ్మర్ అంటూ ముందుగానే వస్తున్నారు. అలా ఫిబ్రవరిలో ఈగల్‌తో మొదలైన సినీ జాతర.. ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వరకు కంటిన్యూ కానుంది.

ఫిబ్రవరి 2న అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ వచ్చింది.. తాజాగా ఈగల్ విడుదలైంది.. ఫిబ్రవరి 16న ఊరిపేరు భైరవకోనతో సందీప్ కిషణ్ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఎందుకో మరి ఫిబ్రవరి మూడు, నాలుగు వారాలను హీరోలు వదిలేసారు.

మళ్లీ మార్చ్ 1 నుంచి మోత మోగనుంది. ఆపరేషన్ వాలెంటైన్‌తో వరుణ్ తేజ్ తెలుగు, హిందీలో దండయాత్రకు సిద్ధమవుతున్నారు.మార్చ్ 8న శివరాత్రి కానుకగా గోపీచంద్ మాస్ సినిమా భీమాతో పాటు విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామి విడుదల కానున్నాయి.

ఇక మార్చి 29న సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ టిట్లు స్క్వేర్ రానుంది. ఆ తర్వాత వారం ఎప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రానుంది. అక్కడితో మీడియం రేంజ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పడి.. మే 9న ప్రభాస్ కల్కితో రంగంలోకి దిగబోతున్నారు.