- Telugu News Photo Gallery Cinema photos On the occasion of Valentine's Day, yesteryear love story films are once again on the silver screen
Love Movies: అలనాటి ప్రేమ కథలు.. ప్రేమికుల రోజు కానుకగా మరోసారి వెండితెరపై..
ప్రేమికుల రోజు.. ప్రేమించిన వాళ్లతో ఓ మంచి ప్రేమకథా చిత్రం చూడటం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..? ఇది మేం చెప్తున్నది కాదండీ బాబూ.. నిర్మాతల ఆలోచనలు అలా ఉన్నాయి మరి. అందుకే ఏరికోరి మరీ పాత సినిమాలను మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 14 క్లాసిక్ లవ్ స్టోరీస్‌తో మరింత కలర్ ఫుల్ కాబోతుంది. మరి ఆ రోజు రాబోతున్న ఆ సినిమాలేంటి..? ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్‌కు మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని లవ్ స్టోరీస్‌ను విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు.
Updated on: Feb 14, 2024 | 1:47 PM

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే లాంటి సినిమాలను యష్ రాజ్ ఫిలింస్ మరోసారి విడుదల చేస్తుండగా.. ఎవర్ గ్రీన్ టైటానిక్ కూడా వాలంటైన్స్ డే రోజు మళ్లీ విడుదల కానుంది. మరి వీటిలో ఫిబ్రవరి 14ను క్యాష్ చేసుకునే ఆ సినిమా ఏంటో చూడాలిక.

ఇప్పుడు ఎలాగూ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి.. దాన్ని ఫాలో అయిపోతూ ఈ వాలంటైన్స్ డేకు కొన్ని కల్ట్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఓయ్ సినిమా గురించి. ఇది ఫిబ్రవరి 14న మరోసారి రిలీజ్ కాబోతుంది. సిద్ధార్థ్, షామిలి జంటగా 2009లో ఆనంద్ రంగా తెరకెక్కించిన ఓయ్ అప్పుడు వర్కవుట్ కాలేదు కానీ తర్వాత కల్ట్ అయిపోయింది. అందుకే వాలంటైన్స్ డేకు ఈ సినిమా తీసుకొస్తున్నారు.

ఇవన్నీ ఎప్పుడో వచ్చిన సినిమాలైతే.. రెండేళ్ల కింద వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ సీతా రామం సినిమాకు వాలంటైన్స్ డే రోజు స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా ఆకట్టుకున్నారు.

అలాగే గౌతమ్ మీనన్ క్లాసిక్ సూర్య సన్నాఫ్ కృష్ణన్‌ను సైతం అదే రోజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్ తొలిప్రేమను ఇప్పటికే ఓసారి రీ రిలీజ్ చేసారు. అయినా కూడా వాలంటైన్స్ డే పుణ్యమా అని మరోసారి తీసుకొస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.




