- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna increased his speed in making films as hero
Balakrishna: ఒకప్పటిలా కాదు అయన.. బాలయ్య 2.0.. నాన్ స్టాప్ సినిమాలతో ఫ్యాన్స్ కి ఖుషి..
హౌ.. ఎలా.. కైసే.. బాలయ్య జోరు చూసాక అందరిలోనూ ఇలాంటి డౌట్సే వస్తున్నాయిప్పుడు. అఖండ ముందు వరకు 30 కోట్లున్న మార్కెట్.. పెరిగితే గిరిగితే ఏ 20 కోట్లో.. 30 కోట్లో పెరగాలి కానీ ఒకేసారి 100 కోట్లకు ఎలా వెళ్లిందా అని జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఆయన మరో సెన్సేషనల్ దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నారు. మరి అదేంటి..? ఇంతకీ బాలయ్య జోరుకు రీజన్ ఏంటి..?
Updated on: Feb 10, 2024 | 5:03 PM

ఇప్పుడు మనం చూస్తున్నది బాలయ్యను కాదు.. ఆయన వర్షన్ 2.0ను. ఒకప్పుడు ఒక్క హిట్ కొడితే.. మూడు నాలుగేళ్ల వరకు మరో హిట్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూసేవాళ్లు.

కానీ ఇప్పుడలా కాదు.. వరస విజయాలు కొడుతూనే ఉన్నారు NBK. దాదాపు 30 ఏళ్ళ తర్వాత హ్యాట్రిక్ అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరసగా మూడు సెంచరీలు కొట్టిన సీనియర్ హీరోగా రికార్డ్ తిరగరాసారు.

అఖండ ముందు వరకు బాలయ్య వేరు.. ఆ తర్వాత బాలయ్య వేరు. అక్కడ్నుంచి ఆయన పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఓ వైపు ఫ్యాన్స్ కోసం యూత్ రోల్ చేస్తూనే.. మరోవైపు ఏజ్డ్ రోల్స్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలలో బాలయ్య కారెక్టర్స్ బలంగా కనెక్ట్ అయ్యాయి.

బాబీ సినిమాలోను మధ్య వయస్కుడిగానే నటిస్తున్నట్లు తెలుస్తుంది. 80వ దశకం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.బాబీ తర్వాత హరీష్ శంకర్‌తో బాలయ్య సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌లో ఇది రానుంది.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్‌తో బిజీగా ఉన్నారు హరీష్. ఇక పవన్ ఉస్తాద్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అందుకే NBK కోసం హరీష్ శంకర్ కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే ఫ్యాన్స్‌కు పండగే.




