AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నాని నెక్స్ట్ అతడితోనే.. రిస్క్ తీసుకుంటున్నాడా ?? కన్ఫ్యూజన్ లో నాచురల్ స్టార్

నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవడూ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకుని అదేంటి అలా అంటారనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం.. ఈయన తీరు ఇలాగే ఉంది మరి. ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్ట్స్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుంది..? ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినపుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Feb 10, 2024 | 1:24 PM

Share
నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవడూ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకుని అదేంటి అలా అంటారనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం.. ఈయన తీరు ఇలాగే ఉంది మరి. ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్ట్స్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుంది..?

1 / 5
ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినపుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో..? నాని కెరీర్‌కు ఈ పాటే పర్ఫెక్ట్ ఇప్పుడు. ఓ సినిమా చేస్తున్నపుడే కనీసం ఇద్దరు దర్శకులను లైన్‌లో పెట్టడం నాని స్టైల్. కానీ చాలా రోజుల తర్వాత ఈయన కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. కళ్ల ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా.. ఎవరనేది తేల్చట్లేదు న్యాచురల్ స్టార్.

2 / 5
నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం రెండు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తీరు చూస్తుంటే మరో రెండు నెలల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా కనిపిస్తున్నారు.

3 / 5
ఈ క్రమంలోనే నాని నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కన్ఫ్యూజన్స్ ఎక్కువవుతున్నాయి. త్రివిక్రమ్ పేరు వినిపించినా అదిప్పట్లో వర్కవుట్ అయ్యేలా లేదు.. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు.

4 / 5
తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఫైనల్ అనుకున్న సినిమా కాస్తా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు నాని ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ వేణు. బలగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. నాని కోసం ఓ కథ సిద్ధం చేసారు. అది ఆయనకు నచ్చిందని తెలుస్తుంది. సరిపోదా శనివారం తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. నాని, వేణు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారో..?

5 / 5