నాగచైతన్య నటించిన సీరీస్ ధూత. చైతూ జర్నలిస్టుగా నటించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. చైతూ నటన, విక్రమ్ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతిదీ ఉత్కంఠను రేపింది. ఈ సీరీస్ చూసిన వారందరూ విక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అయితే బౌన్స్ బ్యాక్ అయింది సినిమాల్లో కాదు... సీరీస్‌లోనే అన్నది అండర్‌లైన్ అవుతున్న పాయింట్.