- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur to Nithin latest movie news from film industry
Movie News: వాటిని అందిపుచ్చుకోవాలని అంటున్న మృణాల్.. ఎక్స్‌ట్రార్డినరీ మేన్ గురించి నితిన్..
తన కెరీర్‌లో ఇప్పటిదాకా చేయని పాత్రను ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్‌లో చేశానని అన్నారు హీరో నితిన్. మంచి కథలు ఎప్పుడైనా, ఎక్కడైనా తలుపు తట్టొచ్చని, అలా రాగానే వెంటనే వాటిని అందిపుచ్చుకోవాలని అంటున్నారు నటి మృణాల్ ఠాకూర్. షారుఖ్ హీరోగా నటించిన సినిమా డంకీ. హరోం హర తన కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని అన్నారు నటుడు సుధీర్‌బాబు. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.
Updated on: Dec 07, 2023 | 11:01 AM

Extraordinary Man OTT

మంచి కథలు ఎప్పుడైనా, ఎక్కడైనా తలుపు తట్టొచ్చని, అలా రాగానే వెంటనే వాటిని అందిపుచ్చుకోవాలని అంటున్నారు నటి మృణాల్ ఠాకూర్. నేనెవరో ప్రేక్షకులకు గుర్తు లేకపోయినా ఫర్వాలేదుగానీ, నేను చేసిన పాత్రలు మాత్రం జనాల్లో నిలిచిపోవాలి అని అన్నారు మృణాల్ ఠాకూర్.

షారుఖ్ హీరోగా నటించిన సినిమా డంకీ. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. రాజ్‌కుమార్ హిరానీ విజన్ నుంచి ఈ కథ మొదలవుతుందని అన్నారు షారుఖ్. స్నేహం, కామెడీ, విషాదం... ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని అన్నారు షారుఖ్. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఫ్యామిలీ గుర్తుకొస్తుందని చెప్పారు.

హరోం హర తన కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని అన్నారు నటుడు సుధీర్‌బాబు. మాళవిక శర్మ ఇందులో నాయిక. ఇటీవల టీజర్ విడుదలైంది. టీజర్‌కి అన్ని భాషల్లోనూ మంచి స్పందన వస్తోందని అన్నారు సుధీర్‌బాబు. ఒక మంచి సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరిందని చెప్పారు సుధీర్.

సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి జరగనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మదురైలోని అమెరికన్ కాలేజ్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్.




