అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు ఈ ముద్దుగుమ్మ. కంచె సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యింది ప్రగ్యాజైస్వాల్. కానీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు అంతగా రాలేదు. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆతర్వాత మాత్రం ఆఫర్స్ అందుకోలేదు. దీంతో ఇటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా మరిన్ని ఫోటోస్ పంచుకుంది.