- Telugu News Photo Gallery Cinema photos Bhaje Vayu Vegam to Harom Hara latest film updates from Tollywood
Movie Updates: నాన్న కోసం వాయువేగంతో.. హరోం హర ఓ పని అయిపొయింది..
కార్తికేయ కథానాయకుడిగా నటించిన సినిమా భజే వాయువేగం. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన సినిమా ఆవేశం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తుపాకులతో సమస్యలను పరిష్కరించే పాత్రలు పోషించడం తనకు నచ్చదని అన్నారు నటుడు ఇమ్రాన్ ఖాన్. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం వాలంటీర్. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోం హర. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
Updated on: Apr 22, 2024 | 8:38 PM

కార్తికేయ కథానాయకుడిగా నటించిన సినిమా భజే వాయువేగం. నాన్న కోసం ఓ యువకుడు ఏం చేశాడనే కథతో తెరకెక్కింది. ఈ సినిమా టీజర్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఉంది టీజర్. యువ దర్శకులు ఇలాంటి మంచి కాన్సెప్టులతో ముందుకొస్తే, ఇండస్ట్రీ బావుంటుందని అన్నారు చిరంజీవి.

ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన సినిమా ఆవేశం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది. ఈ సినిమాలో ఫాహద్ నటన ఆశ్చర్యపోయేలా చేసిందని అన్నారు నటి సమంత. సినిమా ఆద్యంతం నచ్చిందని, అందరూ చూడాలని చెప్పారు సామ్.

తుపాకులతో సమస్యలను పరిష్కరించే పాత్రలు పోషించడం తనకు నచ్చదని అన్నారు నటుడు ఇమ్రాన్ ఖాన్. ఇటీవల సినిమాల్లో అలాంటి సినిమాలు చూసి తాను ఇబ్బంది పడినట్టు చెప్పారు. ఇటీవల రణ్‌బీర్ నటించిన యానిమల్‌లో ఇలాంటి సన్నివేశాలున్నాయని, ఇమ్రాన్ మాట్లాడింది ఈ సినిమా గురించేనని అంటున్నారు నెటిజన్లు.

చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం వాలంటీర్. సూర్య కిరణ్, దియ రాజ్ జంటగా నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం తిరుపతిలో జరిగింది. ఎం ఎల్ సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తన్నారు. నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమని అన్నారు మేకర్స్.

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోం హర. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కుప్పంలో 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతోంది. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.




