అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-వాహనాలపై సబ్సిడీ ఇవ్వాలని రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు రవాణా శాఖ మంత్రి పద్మనవ్ బెహెరా గతంలో తెలిపారు. ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ‘ఈ-వెహికల్’ విధానాన్ని అమలు చేశాయి. దీంతోరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం వడ్డీ రహిత రుణాన్ని అందించాలని నిర్ణయించింది.