- Telugu News Photo Gallery Business photos Oppo A95 Renders, Promo Images Surface Online; Shows Hole Punch Display, Triple Rear Cameras, More
Oppo: ఒప్పో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో విడుదల..!
Oppo: భారత మార్కెట్లో రోజుకో స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి మొబైల్ కంపెనీలు. కస్టమర్లను మరింతగా ..
Subhash Goud | Edited By: Anil kumar poka
Updated on: Nov 04, 2021 | 9:12 AM

Oppo: భారత మార్కెట్లో రోజుకో స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి మొబైల్ కంపెనీలు. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువస్తున్నాయి.

ఇక తాజాగా భారత మార్కెట్లో ఒప్పో ఏ95ను త్వరలో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఏ95 ప్రోమో ఇమేజ్‌లు లీక్ కావడంతో స్మార్ట్‌ఫోన్‌కు చెందిన పలు వివరాలను 91మొబైల్స్ వెల్లడించింది.

ఒప్పో ఏ95 6.43 అంగుళాల ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో ఉండనుంది. అలాగే కలర్ఓఎస్ 11, ఆండ్రాయిడ్ 11, అడెర్నో 610 జీపీయూలపై రన్ అవుతుందని వెల్లడించింది. మరిన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్నట్లు తెలిపింది.

ఏ95 గ్లోయింగ్ స్టారీ బ్లాక్, రెయిన్‌బో సిల్వర్ వంటి రెండు కలర్స్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మొబైల్ 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉండనున్నట్లు 91మొబైల్స్ పేర్కొంది.





























