- Telugu News Photo Gallery Best tips for winter skin and health problems, Check Here is Details in Telugu
Winter Problems: శీతా కాలంలో వచ్చే సమస్యలకు బెస్ట్ చిట్కాలు.. డోంట్ మిస్!
శీతాకాలం వచ్చిందంటే చాలా సమస్యలు వస్తాయి. శరీరం లోపల నుంచే కాకుండా.. శరీరం బయట కూడా చాలా మార్పులు జరుగుతాయి. పొడి చర్మం, పొడి జుట్టు, పాదాల్లో పగుళ్లు, దగ్గు, జలుబు, జ్వరం వంటివి కనిపిస్తాయి. మరికొందరిలో కఫం బాగా పేరుకుపోతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. మీ కోసం కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాం. పొడి జుట్టుతో ఇబ్బంది పడేవారు.. గుడ్డు పచ్చ సొన, ఆలివ్ ఆయిల్ కలిపి మొత్తం జుట్టుకు..
Updated on: Oct 25, 2024 | 3:48 PM

శీతాకాలం వచ్చిందంటే చాలా సమస్యలు వస్తాయి. శరీరం లోపల నుంచే కాకుండా.. శరీరం బయట కూడా చాలా మార్పులు జరుగుతాయి. పొడి చర్మం, పొడి జుట్టు, పాదాల్లో పగుళ్లు, దగ్గు, జలుబు, జ్వరం వంటివి కనిపిస్తాయి. మరికొందరిలో కఫం బాగా పేరుకుపోతుంది.

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. మీ కోసం కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాం. పొడి జుట్టుతో ఇబ్బంది పడేవారు.. గుడ్డు పచ్చ సొన, ఆలివ్ ఆయిల్ కలిపి మొత్తం జుట్టుకు బాగా పట్టించండి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల పొడి జుట్టు బాగా తగ్గుతుంది.

పొడి చర్మం సమస్య వేధిస్తూ ఉంటే.. ఒక గిన్నెలో కొద్దిగా టమాటా రసం, పెరుగు రాసి ఆరిన తర్వాత కడిగేస్తే.. పొడి చర్మం తగ్గుతుంది. కాకర రసం, కలబంద గుజ్జు కలిపి రాత్రంతా ముఖానికి పట్టించి ఉదయం కడిగినా మంచి ఫలితం కనిపిస్తుంది.

పాదాల పగుళ్లతో ఇబ్బంది పడేవారు కొద్దిగా వంట నూనెలో పసుపు కలిపి పాదాలకు పట్టించండి. ఇలా రోజూ చేస్తే.. త్వరగా తగ్గుతుంది. అలాగే అరటి పండు గుజ్జును పాదాలకు పట్టించి.. ఓ పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. మృదువుగా మారతాయి.

అదే విధంగా జలుబు, దగ్గు వేధిస్తూ ఉంటాయి. పాలలో పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే కంట్రోల్ అవుతాయి. అలాగే ఆహారంలో అల్లం తీసుకుంటూ ఉండండి. గోరు వెచ్చటి పసుపు నీళ్లను గొంతులో వేసి పుక్కిలించినా దగ్గు తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




