ప్రజెంట్ స్టార్ హీరోల మార్కెట్ స్టామినాను వసూళ్ల రికార్డ్‌లతోనే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. డే వన్, ఫస్ట్ వీక్, ఓవరాల్ కలెక్షన్స్.. ఇలా తమ అభిమాన హీరో అచ్చీవ్‌మెంట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కోలీవుడ్‌లోనూ ఇదే రేసు నడుస్తోంది. ఈ రేసులో దళపతి విజయ్ ఒక అడుగు ముందున్నారు.