- Telugu News Photo Gallery 7 Foods That Can Damage Your Kidneys, check What to Avoid for Better Kidney Health
Health Tips: కిడ్నీలను సైలెంట్‌గా చంపేస్తున్న ఆహారాలు.. వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే అంతే సంగతులు..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన జీవనశైలి, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మనం తరచుగా వింటుంటాం. అయితే గుండెను హెల్దీగా ఉంచుకోవడం వల్ల కిడ్నీలను సైతం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఒక సమతుల్యమైన జీవనశైలిని పాటించడం అవసరం. అయితే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వాటిని తీసుకోకపోవడం మంచిది.
Updated on: Sep 24, 2025 | 12:27 PM

ఉప్పు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ చిప్స్, ఇన్‌స్టాంట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది.

రెడ్ మీట్: ఇందులో ప్రోటీన్, ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి మూత్రపిండాల్లో రాళ్లకు, వాటి పనితీరు తగ్గడానికి కారణమవుతుంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్: ప్యాక్ చేసిన స్నాక్స్, డబ్బాల్లో ఉంచిన సూప్‌లు వంటి వాటిలో ఉండే అధిక సోడియం, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

స్వీట్ డ్రింక్స్: సోడా, ఇతర తీపి పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత పెరుగుతాయి. ఇది మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు.

పాల ఉత్పత్తులు: అధిక పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఫాస్పరస్, కాల్షియం స్థాయిలు పెరిగి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇప్పటికే కిడ్నీ వ్యాధి ఉన్నవారికి ఇది మరింత హానికరం.

కెఫిన్: కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే రక్తపోటు పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడి పెంచి, వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఫాస్ట్ ఫుడ్స్: నూనెలో వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, అధిక రక్తపోటుకు దారితీసి, మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జాగ్రత్తలు పాటించడం ద్వారా మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా, మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




