- Telugu News Photo Gallery These plants are a nuisance to mosquitoes. If you keep them at home, they will stay away.
ఈ మొక్కలంటే దోమలకు దడ.. ఇంట్లో పెట్టుకుంటే పక్కకు రావు..
వర్షాకాలంలో దోమలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి కారణం ఈ సీజన్‌లో గుంతల్లో నీరు నిల్వ ఉండడమే. అంతేకాదు మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే ఉంటుంది. ఈ కారణాల వలన ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి. కనుక వర్షాకాలంలో ఈ మొక్కలను బాల్కనీలో లేదా గార్డెన్లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి. ఈరోజు అటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం..
Updated on: Sep 26, 2025 | 2:20 PM

వేప: వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు. అంతేకాదు వేపనూనెను కూడా ఉపయోగిస్తారు. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలో వేప మొక్కను నాటండి. ఇంట్లో స్థలం సమస్య ఉంటే. ఇప్పుడు బోన్సాయ్ వంటి వేప మొక్కలు లభిస్తున్నాయి.

నిమ్మగడ్డి: ఈ మొక్క ఇది దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు, రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క డెంగ్యూని వ్యాప్తి చేసే దోమల నుండి రక్షించగలదని కూడా నమ్మకం. .

ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఇది తల చర్మం దురద, వాపు లేదా ఎరుపుదనాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

తులసి: ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది. ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

క్యాట్నిప్: పుదీనా ఆకులను పోలి ఉండే ఈ మొక్క ఎండలోనూ, నీడలోనూ బాగా పెరుగుతుంది. ఇది పురుగుమందు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో అలాగే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.

అజెరాటం: ఈ మొక్క క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలు లేత నీలం, తెలుపు పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పువ్వుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన ప్రభావం వల్ల చుట్టుపక్కల దోమలు రావు. ఈ పువ్వులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు.




