- Telugu News Photo Gallery Spiritual photos Rare Raj Yoga 2025: Wealth, Power and Fame for These Zodiac Signs Details in Telugu
Viparita Raj Yoga 2025: ఈ రాశులకు విపరీత రాజయోగం.. వారికి అనుకోకుండా ఐశ్వర్యం..!
Powerful Raj Yoga 2025: జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా, ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం అంటే, అతి త్వరగా జీవితంలో అందలాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సామాజిక హోదా, పలుకుబడి పెరగడం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కావడం వంటివి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం త్వరలో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి ఈ విపరీత రాజయోగం పూర్తి స్థాయిలో కలిగింది. వచ్చే నెల (అక్టోబర్) రెండవ వారం వరకు ఈ యోగం కొనసాగుతుంది.
Updated on: Sep 24, 2025 | 8:20 PM

మేషం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ఆరవ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజ యోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు తప్పకుండా అధికారం చేపడతారు. ఒక సంస్థను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ప్రజా ప్రతినిధిగా గౌరవాలందుకుంటారు. చిన్న వయసు లోనే ఏదో ఒక నైపుణ్యంలో గుర్తింపు పొందడం జరుగుతుంది. విదేశాల్లో చదువులు, వృత్తి, ఉద్యోగాల వంటివి చోటు చేసుకుంటాయి. సమాజంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

వృషభం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. సమాజంలో వీరి మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మదుపులు, పెట్టుబడులు లాభాలనిస్తాయి.

కర్కాటకం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల అతి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. అనుకోకుండా ఆస్తి కలసి వచ్చి ఐశ్వర్యవంతులు కావడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం: ఈ రాశికి 6 స్థానాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారు నిజంగానే ఒక రాజు మాదిరిగా జీవించడం జరుగుతుంది. అతి తక్కువ ప్రయత్నంతో రాజకీయ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చదువులు, ఉద్యోగాల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. అత్యంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకుని ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంటుంది.

తుల: ఈ రాశివారికి 12వ స్థానాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురుండదు. ఒక పెద్ద వాణిజ్య సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఇతరులకు ఉద్యోగం ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తి మీద చెరగని ముద్ర వేస్తారు. ఉద్యోగాల్లో అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యం, ప్రాభవం లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం ఏర్పడినప్పుడు వృత్తి, వ్యాపారాల్లో చక్రం తిప్పుతారు. సామాజిక సేవా సంస్థను లేదా ట్రస్టును నిర్వహించే అవకాశం ఉంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. మేధా విగా, సలహాదారుగా గుర్తింపు పొందుతారు. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ప్రముఖులకు దీటుగా పలుకుబడి పెరుగుతుంది.



