- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's OG Pre Release Business Box Office Potential and Top Telugu Films
OG: హైయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే
ఒకప్పుడు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కే ఆశ్చర్యపోయేవాళ్ళు కానీ ప్యాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత బిజినెస్ రేంజ్ వందల కోట్లకు చేరిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల రేంజ్ అమాంతం అలా పై పైకి వెళ్లిపోతుంది. మరి ఈ లిస్టులో ఓజి ప్లేస్ ఎక్కడుంది..? అసలు టాలీవుడ్‌లో హైయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమాలేంటి..?
Updated on: Sep 24, 2025 | 12:20 PM

ఓజి.. ఓజి.. తెలుగు సినిమాకు ఇప్పుడు ఓజి ఫీవర్ పట్టుకుంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. సుజీత్ స్టైలిష్ మేకింగ్, పవన్ గ్యాంగ్ స్టర్ లుక్.. మాఫియా బ్యాక్‌డ్రాప్ అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి.

మామూలుగానే పవన్ సినిమా అంటే బిజినెస్‌కు రెక్కలొస్తాయి.. ఓజికి ఇంకాస్త ఎక్కువే. వరల్డ్ వైడ్‌గా 170 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది OG. ప్యాన్ ఇండియన్ రిలీజ్ అవుతున్నా.. మిగిలిన హీరోలతో పోలిస్తే పెద్దగా ఓజిని ప్రమోట్ చేయలేదు పవన్.

దాంతో మేజర్ షేర్ తెలుగు నుంచే రావాలి. 300 కోట్లకు పైగా వసూలు చేస్తేనే ఓజి సేఫ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ 10 హైయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజి కూడా ఒకటి.

దీనికంటే ముందు దేవర 182 కోట్లు, సైరా 187 కోట్ల బిజినెస్ చేసాయి.200 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి.

రాధే శ్యామ్ 202 కోట్లు.. గేమ్ ఛేంజర్ 221 కోట్లు.. ఆదిపురుష్ 240 కోట్లు.. సాహో 270 కోట్లు.. సలార్ 345 కోట్లు.. బాహుబలి 2 సినిమాకు 352 కోట్లు.. కల్కి 370 కోట్లు.. ట్రిపుల్ ఆర్ 451 కోట్లు.. పుష్ప 2 సినిమా 617 కోట్లతో ముందున్నాయి. ఇప్పుడు ఓజి రేసులోకి వచ్చింది.




