- Telugu News Photo Gallery Cinema photos Is Samantha Dating Raj Nidimoru New Video Fuels Romance Speculation
Samantha: ప్రియుడితో దొరికిపోతున్న సమంత.. దాని కోసమేనా
గాడ్‌ఫాదర్‌లోని ఓ సీన్‌లో.. దొరికిపోయాం అన్నా అంటే.. అయితే అందరూ దొరికిపోండి అంటారు చిరంజీవి. సమంతను చూస్తుంటే ఈ డైలాగే గుర్తొస్తుందిప్పుడు. తన రిలేషన్ తెలిసేలా కావాలనే ఓపెన్ అవుతున్నారేమో.. ఇక తాను సింగిల్ కాదని చెప్పడానికే ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే..! సేమ్ వీడియోతో మళ్లీ ట్రెండ్ అవుతున్నారు స్యామ్.
Updated on: Sep 24, 2025 | 12:31 PM

విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తున్నారీమే.

రెండేళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక.. తెలుగులో కనిపించడమే మానేసారు స్యామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు. మరో దర్శకుడు DK. ఈ ఇద్దరూ తెలుగు వాళ్లు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమోరుతో తరుచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. తాజాగా ఒకే జిమ్‌లో కలిసి కనిపించారు ఈ ఇద్దరూ.

ఆ మధ్య ఓ పార్టీలో.. ఆ తర్వాత పికిల్‌బాల్ స్పోర్ట్స్ ఈవెంట్, కామన్ ఫ్రెండ్స్ పార్టీ, తర్వాత తిరుమలలో.. మొన్నామధ్య ఒకే కార్‌లో కలిసే కనిపించారు రాజ్ సమంత. తాజాగా ముంబైలోని జిమ్ దగ్గర కలిసి కనిపించారు.

ఈ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. ప్రస్తుతం స్యామ్ నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నది రాజ్ డికే ద్వయమే. ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కాదని స్యామ్ హింట్ ఇస్తున్నట్లే అనిపిస్తుంది.




