Diabetes: మధుమేహం బారిన పడిన వారు ఎవరిని సంప్రదించాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? నిపుణుల మాటేంటి..

Diabetes: మధుమేహం వ్యాధి విషయంలో భారత్‌ను ప్రపంచ రాజధానిగా చెబుతుంటారు. భారత్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న డయాబెటిస్‌ రోగుల సంఖ్యే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా...

Diabetes: మధుమేహం బారిన పడిన వారు ఎవరిని సంప్రదించాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? నిపుణుల మాటేంటి..
Diabetes
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 11, 2022 | 4:44 PM

Diabetes: మధుమేహం వ్యాధి విషయంలో భారత్‌ను ప్రపంచ రాజధానిగా చెబుతుంటారు. భారత్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న డయాబెటిస్‌ రోగుల సంఖ్యే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ (IDF) 2020 లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తం 463 మిలియన్ల మందికి, ఆగ్నేయాసియాలో 88 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. 88 మిలియన్లలో 77 మిలియన్ల మంది భారతీయులే కావడం గమనార్హం. దీంతో పెరుగుతోన్న ఈ గణంకాలు భయాందోళనలు గురి చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే డయాబెటిస్‌ ఆందోళన కలిగించే ఆంశమే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వ్యాధి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే చాలా మంది వ్యాధి బారిన పడిన తర్వాత ఎవరిని సంప్రదించాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తెలియకే ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మణిపాల్ హాస్పిటల్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ గిరిధర్ అడపా న్యూస్9 తో డయాబెటిస్‌కు సంబంధించి పలు విషయాలు పంచుకున్నారు. డయాబెటిస్‌ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..

డయాబెటిస్‌ ఉన్న వారు ఎవరిని సంప్రదించాలి.?

ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే వారు జనరల్‌ డాక్టర్‌ లేదా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించాలి. నిర్ధిష్టంగా డయాబెటిస్‌ వ్యాధికి చికిత్స అందించడంలో ఎండోక్నిజాలజిస్ట్‌లు నైపుణ్యం కలిగి ఉంటారు. దీంతో వ్యాధి మూలాలను గుర్తించిన చికిత్స అందించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే చాలా మంది శరీరంలో పెరిగే చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడానికి డైటీషియన్‌ను సంప్రదిస్తే సరిపోతుందనే అపోహలో ఉంటారు. డైటీషియన్‌ శరీరంలో టైప్‌ 1 లేదా టైప్‌ 2 డయాబెటిస్‌ ఉందా అన్న విషయాన్ని నిర్ధారించలేరు.

డయాబెటిస్‌ అనేది జీవిత కాల వ్యాధి. దీనిని నివారించాలంటే ముందుగా రోగ నిర్ధారణ జరగాలి. అనంతరం వీలైనంత త్వరగా జీవన విధానం, ఆహారంలో మార్పులు చేస్తే ఫలితం ఉంటుంది. ఇక డయాబెటిస్‌ రోగులకు ఎండోక్రినాలజిస్ట్‌లు డైటింగ్‌ ప్లాన్‌ను సిఫార్సు చేస్తారు. వీరు రోగి వ్యాధి తీవ్రతను ఆధారంగా ఆహారంలో మార్పులు చేర్పులు చేయమని చెబుతారు. ఇలా ఆహారంలో చేసే మార్పులు చక్కెర స్థాయిల్లో మార్పులకు కారణమవుతుంది.

ఆహారం విషయంలో జాగ్రత్త..

మధుమేహం అంతసులభంగా తగ్గించలేము. ఇది ఒక జీవిత కాల వ్యాధి. కాబట్టి తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేర్పులు చేయడం వల్లే వ్యాధి మూలాలను తగ్గించవచ్చు. సదరు రోగి శారీరకంగా యాక్టివ్‌గా ఉన్నారా.? లేదా ఎక్కువ సమయం ఖాళీగా కూర్చుకుంటున్నారా? అంశం ఆధారంగా తీసుకునే ఆహారం విషయమై నిపుణులు సూచనలు చేస్తుంటారు. అయితే షుగర్‌ తీవ్ర స్థాయిలో ఉన్న వారు మాత్రం కనీసం మూడు నెలలపాటు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షుగర్‌ లెవల్స్‌ స్థాయిలోకి వచ్చే వరకు ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఆ తర్వాత నిత్యం మందులు వాడుతూ డైట్‌ మెయింటెన్‌ చేస్తే సరిపోతుంది అని డాక్టర్‌ గిరిధర్ వివరించారు.

Also Read: KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

LIC Policy: సామాన్యులకు అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా 63 రూపాయలు చెల్లిస్తే.. మెచ్యూరిటీకి అధిక రాబడి!

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో స్పిన్నర్లదే హవా.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?